స్వదేశానికి తరలిస్తున్న భారత ఎంబసీ..
సిరియాలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నందున అక్కడున్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు భారత విదేశంగా శాఖ ప్రకటించింది. దాదాపు 75 మంది భారతీయులను కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లమధ్యలెబనాన్ కు గత అర్ధ రాత్రి తరలించినట్లు లెబనాన్ నుంచి వారంతా కమర్షియల్ ఫ్లైట్స్ ద్వారా భారత్ చేరుకుంటారని మన విదేశాంగ శాఖ తెలిపింది.మొత్తం 75 మందిలో కొంతమంది జమ్మూ కశ్మీర్ కు చెందిన ముస్లిం యాత్రీకులుకూడా ఉన్నారని తెలిపింది. వీరంతా సైదా జైనబ్ అనే ప్రాంతంలో చిక్కుకు పోయారు. సిరియాలో అధ్యక్షుని పదవీ చ్యుతి తర్వాత రెబల్స్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తుండటం, మరోవైపు ఇజ్రాయెల్,అమెరి కాఎయిర్ స్ట్రైక్స్, సుస్థిర వాతావరణం ఏర్పడని నేపధ్యంలో మన విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. డమాస్కస్, బీరుట్ లలో ఉన్న భారత ఎంబసీలు సమన్వయంతో ఈ తరలింపు ప్రక్రియ చేపట్టాయి.మరికొందరు భారతీయులు ఇంకా ఉన్నారని వారందరిని సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ భారత ఎంబసీలతో టచ్ లో ఉండమని సూచించినట్లు విదేశాంగ శాఖ అర్ధ రాత్రి దాటాక విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది.
మార్చి1 కల్లా కొత్త ప్రభుత్వం :రెబల్స్
మరోవైపు రెబల్స్ నేత అల్ బషీర్ మార్చి 1 కల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరారు. రెబల్స్ తమంత తాముగా అధికారం తీసుకోకుండా తాత్కాలిక ప్రభుత్వాన్నిఏర్పాటుచేసుకుని శాంతంగా స్థిరంగా ప్రజాస్వామ్యపద్ధతిలో అధికార బదలాయింపు చేయాలని బైడెన్ ప్రభుత్వ వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వర్గాలతో కూడా రెబల్స్ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సిరియా వ్యవహారం అంతా పెద్దతలనొప్పిగా మారిందని అందులో అమెరికా వేలు పెట్టొద్దని ట్రంప్ ఇప్పటికే తన అభిప్రాయంవెల్లడించారు.