26.7 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

మంచులా కరుగుతున్న మోహనబాబు కుటుంబ ఇమేజ్

సీనియర్ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ముదిరి పాకాన పడ్డాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టుకోవడం, మీడియా మీద దాడులు చెయ్యడం వంటి ఘటనలతో ఇంతకాలం లోలోన జరిగుతున్న కుటుంబ అంతర్గత వివాదాలు నేడు రోడ్డుకెక్కాయి. తాజాగా పోలిసులు సీరియస్ అయి మోహన్ బాబుతో పాటు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ లను తమ ముందు హజరుకమ్మని రాచకొండ పోలీస్ కమీషన్ సుధీర్ ఆదేశించారు. ఆలాగే మోహన్ బాబు, ఆయన పెద్ద కారుడు విష్ణువర్ధన్ ల పేరు మీ ఉన్న లైసెన్స్ డ్ గన్లను వెంటనే స్వాధీనం చెయ్యాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం రాత్రి మంచు మనోజ్ అతని భార్య మౌనికలను జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి అనుమతించకపోవడం పరిస్ధితి పూర్తిగా గందరగోళంగా తయారైంది. తనని తన భార్యని మోహన్ బాబు నివాసంలోకి రానివ్వకపోవడంతో ఆగ్రహోదగ్ధుడైన మంచు మనోజ్ అక్కడున్న బౌన్సర్లపై తిరగబడి గేట్లు బద్దలు కొట్టుకుని తన మనుషులతో కలసి లోపలికి వెళ్లాడు. ఈ దశలో మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చి ఆవేశపడిపోయి ఒక ఛానల ప్రతినిధి నుంచి మైకు లాక్కుని అతన్నే తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో రిపోర్టర్ కి తీవ్ర గయామై తలలో ఎముక చిట్లింది. దీంతో మీడియా ప్రతినిధులు పెద్ద యెత్తున నిరసనలకు దిగారు. మీడియా మీద జరిగిన దాడిపై పోలీసులు కూడా సీరియస్ అయి మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com