33 C
Hyderabad
Sunday, May 31, 2026

Live Video

spot_img

బుధవారం నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం

ఆరు నెలల్లో రెండో కలెక్టర్ల సమావేశం

బుధవారం నుంచి నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధ, గురువారాల్లో ఈ సదస్సు జరగుతుంది. ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు తదితర అంశాలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగే ఈ సదస్సులో వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకోనున్నారు. సమావేశం మొదటి రోజు ఆర్టీజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ-వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్ పై చర్చిస్తారు. మధ్యాహ్నం నుంచి  వ్యవసాయం, పశుసంవర్ధక, హార్టీకల్చర్, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్, నరేగా, రూరల్ వాటర్ సప్లై, సెర్ప్, పట్టణాభివృద్ధి, సీఆర్డీయే, శాంతి భద్రతలు వంటి అంశాలపై కాన్ఫరెన్స్‌లో చర్చిస్తారు. రెండో రోజు పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్ పోర్ట్,  రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తారు. ఈ సమావేశంలో మంత్రులు, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com