ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మళ్లీ కదలిక మొదలైంది. అమరావతిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. 11,467 కోట్ల రూపాయల వ్యయంతో సీఆర్డీయే చేపట్టబోయే 20 సివిల్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర సహకారంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇచ్చే రుణాలతో ఈ పనులను పూర్తి చేయనున్నారు. ఈ నిధులతో మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిల బంగ్లాలు, ప్రభుత్వోద్యోగుల నివాసాలు, సెక్రటేరియట్ టవర్లతో పాటు రాజధాని పరిధిలో మౌలిక సదుపాయలు కల్పిస్తారు. రాజధాని తాగునీటి అవసరాలకు కూడా ఈ నిధులను వెచ్చించి కొండవీటి వాగు, పాలవాలను వెడల్పు చేసే పనులు కూడా పూర్తి చేస్తారు. అలాగే నీరుకొండ, శాఖమూరుల వద్ద రిజర్వాయర్ల నిర్మాణానికి 1585 కోట్లు కేటాయించారు. గతంలో ఆగిపోయిన హ్యాపీనెస్ట్ అపార్టమెంట్ల నిర్మాణాకి 984 కోట్లు మంజూరు చేశారు. వరదనీటి కాలువలు, డ్రైనేజి వ్యవస్ధ, నీటి సరఫరా, సీనరేజి, యుటిలిటీ డక్ట్స్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లు సైతం ఈ నిధుల నంచే అభివృద్ధి చేస్తారు.
- Advertisement with us -