32.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నుంచి శకుంతలక్కయ్యా రిలీజ్

వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌’. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ కి రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి శకుంతలక్కయ్యా సాంగ్ ని రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ ఎనర్జిటిక్ పార్టీ బీట్స్ తో ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ మాస్ ని ఆకట్టుకున్నాయి. సింగర్ ఉమా నేహా పవర్ ఫుల్ వోకల్స్ మరింత ఎనర్జీని తీసుకొచ్చాయి. ఈ సాంగ్ లో మాస్ డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. పెర్ఫెక్ట్ పార్టీ సాంగ్ గా అలరించిన ఈ పాట ఇన్స్టంట్ హిట్ అయ్యింది.

అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com