రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను తనిఖీ చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. మంగళ, బుధవారాల్లో పింఛనుదారుల ఇళ్ళకు వెళ్ళి అధికారులు వివరాలు సేకరించనున్నారు. తొలివిడతగా ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఉన్న లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళి అధికారులు వారి వివరాలను నమోదు చేసుకుంటారు. ఈ తనిఖీలకు పక్క మండలాలకు చెందిన అధికారులను వినియోగించనున్నారు. ఒక్కో అధికారుల బృందం 40 మంది పింఛనుదారులను తనిఖీ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులను పింఛన్ల లబ్దిదారుల జాబితాలో చేర్చారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ రాష్ట్ర వ్యాప్త పింఛన్ల తనిఖీకి సిద్దమైంది. అయితే పింఛన్ లబ్దిదారుల కోతకే కూటమి ప్రభుత్వం ఈ తనిఖీలకు పూనుకుంటోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.
- Advertisement with us -