40.2 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

సిరియాలో రసాయన ఆయుధ నిల్వలు

  • వణుకుతున్న ప్రపంచం..మాకు అక్కరలేదన్న రెబల్స్
  • ఆయుధ నిల్వలపై ఇజ్రాయెల్ సైన్యం ఎయిర్ స్ట్రైక్స్

  సిరియాలో అల్ బషర్ అసద్ నియంత్రుత్వ పాలనకు బ్రేక్ పడిన తర్వాత  అందరి కళ్లూ ఆ దేశం పైనే ఉన్నాయి. యుద్ధ కాంక్ష కలిగిన అగ్ర దేశాలు సిరియాపై పట్టుకోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటే, మరికొన్ని దేశాలు మాత్రం సిరియాలో ఉన్న ఆయుధ నిల్వలపై  కన్నేశాయి. ఇజ్రాయెల్  ఇప్పటికే  కొన్ని ఆయుధాలపై ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేసింది. ప్రపంచం మాత్రం సిరియా లో ఉన్న ప్రమాదకర వాతావరణం పై భయాందోళనలు వ్యక్తం చేస్తోంది. . ఎందుకంటే ఆదేశంలో రసాయన ఆయుధాలు కుప్పలు తెప్పలుగా నిల్వ ఉన్నాయి. అధ్యక్షుడు అల్ బషర్  తన ఏలుబడిలో అనేక సార్లు  సైలెంట్ గా వాటిని తిరుగు బాటు దారులపై ప్రయో గించారు కూడా. ఒకప్పుడు నెర్వ్ గ్యాస్ ను కూడా బషర్ ప్రభుత్వం ప్రయోగించి వేలల్లొ మరణాలకు కారణమైంది. ఇప్పుడు రెబల్స్ గుప్పిట్లోకి వెళ్లిన ఆ దేశంలో రెబల్స్ ఒక్కసారిగా  ఆ ఆయుధాలపై కన్నేస్తే పరిస్థితి ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమకు ఆయుధాలపై ఆసక్తి లేదని రెబల్స్ చెప్పినప్పటికీ వారి మాటలను పూర్తిగానమ్మలేము. గతంలోనే  రసాయన ఆయుధాల వినియోగం నిషేధం ఒప్పందంపై సిరియా సంతకం చేసినప్పటికీ అల్ బషర్ అనేక సార్లు దానిని ఉల్లంఘించారు. తాజాపరిణామాల నేపధ్యంలో సిరియాలో ఈ ఆయుధాలపై అందరూ కంగారు పడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com