29.7 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

పత్తర్ కా ఘోష్ . …. భట్టీజీ కా జోష్

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలు పార్టీ క్యాడర్ లోనే కాదు సీనియర్ మంత్రి మండలి సభ్యులల్లో కూడా జోష్ నింపుతోంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నక్లెస్ రోడ్డులో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పలువురు సీనియర్ నాయకులు పాల్గొని ఆనందోత్సాహాలతో గడిపారు. ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిని తిలకించిన డిప్యూటీ సీయం ఆ తరువాత గాయకులకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం మత్స్యశాఖ ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును సందర్శించి అందులో స్టాల్స్ ని పరిశీలించారు. అలాగే నక్లెస్ రోడ్ హెచ్ఎండిఏ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన బడే మియా కబాబ్స్ స్టాల్ ని సందర్శించి అక్కడ పత్తర్ కా ఘోష్ ని చాలా ఇష్టంగా తిన్నారు. తనతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో పాటు పలువురు సీనియర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో శనివారం రాత్రి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com