29.7 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

తెలంగాణని దేశానికే రోల్ మోడల్ చేస్తాం – భట్టి

తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేసి చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రితో కలసి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక వైపు అప్పులు తీర్చుకంటూ మరో వైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. మా ఏడాది పాలనలో మొదటి ఆరు నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ కింద పోగా మిగితా ఆరు నెలల్లోనే అద్భుతాలు సృష్టించామని భట్టి తెలిపారు. బీఆర్ఎస్ నేతలు నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. పదేళ్లలో నల్గొండకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చెయ్యలేకపోయిందన్నారు. శ్రీశైల సొరంగ మార్గం ఏడాదికి ఒక కిలోమీటరు తవ్వినా గడచిన పదేళ్ళలో పది కిలోమీటర్లూ పూర్తైపోయి ఉండేదన్నారు. కానీ టీఆర్ఎస్ నేతలు పట్టించుకోలదని పేర్కొన్నారు. ఇదేకాకుండా బ్రాహ్మణవెల్లెం, డిండి, నక్కలగండి అన్ని ప్రాజెక్టులు పక్కకు పడేశారని డిప్యూటీ సీయం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి ప్రాజెక్టు విషయాన్ని గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ జరిపించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పవర్ ప్రాజెక్టు ప్రారంభానికి అనుమతులు సాధించి.. ఏడాది కాలంలోనే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని తెలిపారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తి చేసినట్లే శ్రీశైలం సొరంగ మార్గాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. చేసిన పనులకు ప్రతినెల బిల్లులు చెల్లించి నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు పారిస్తామని తెలిపారు. ఫిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ పనులకు అనుమతులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరారని ఆ పనులకు ఆర్థిక అనుమతులు ఇచ్చాకే ఇక్కడికి వచ్చామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. మా ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి ఐదువేల కోట్లు కేటాయించిందని, ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాలను ప్రారంభిస్తామని డిప్యూటీ సీయం తెలిపారు. నల్గొండ జిల్లాలో శనివారం మెడికల్ కళాశాల, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, బ్రాహ్మణవెల్లాం ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి ఒకేరోజు వైద్యం, విద్యుత్తు, సాగునీరు నల్లగొండ ప్రజానీకానికి అంకితం చేశామని డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com