వెలమ నా కొడకల్లరా మిమ్మల్ని సంపి తీరుతామని షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై కుట్రలు పన్నితే.. దాడులు చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెల్వకుండా వెలమ నా కొడుకుల అంతు చూస్తాం.. ఒక్కొక్కని వీపులు విమానం మోగుతాయని, బాషింగాలు కడతామని పరుష పదజాలం ఉపయోగించారు.
వెలమ సామాజిక వర్గాన్ని కించపరచుతూ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సి కవిత ఖండించారు. షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలు ఒక ప్రజా ప్రతినిధి స్థాయికి తగదని హితవు పలికారు.ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేయాలలర్ డిమాండ్ చేశారు.
వెలమ సామాజికవర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన వీర్లపల్లి శంకర్‌పై దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు.