27.7 C
Hyderabad
Tuesday, May 26, 2026

Live Video

spot_img

ఏక్ నాథ్ షిండే రూటే సెపరేటు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా నిన్న ప్రమాణం చేసిన శివసేన నేత ఏక్ నాథ్ షిండే తన రూటే సెపరేట్ అనుకున్నారో ఏమో సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించారు. 5గంటల వరకూ ఆయనసలు ప్రమాణానికి వస్తాడో రాని సందిగ్ధత బీజేపి నేతలకు కలిగించారు.చివరి నిమిషంలో వచ్చి స్టేజిపై ఆశీనులయ్యారు. తన వంతు ప్రమాణం రాగానే లేచి మైకు దగ్గరకు చేరుకున్నారు. గవర్నర్ రాధాక్రిష్ణ లేని నేను అని ప్రమాణం చెప్పడానికి సంకేతమిచ్చారు. కానీ ఏక్ నాథ్ మాత్రం గొంతు సవరించుకుని మోడీకి, అమిత్ షా, ఇతర బీజేపి అగ్ర నేతలకు ప్రణామాలు అన్నారు. ఆ తర్వాత శివసేన నేత బాల్ థాకరేను,తన రాజకీయ ఎదుగుదలకు దోహదపడిన ఆనంద్ దిగే పేరును తలచుకుని ఆ తర్వాత ఏకనాథ్ షిండే అను నేను అని ప్రమాణం చేశారు. ఊహించని ఈ చర్యకు మోడీ సహా స్టేజిపై ఉన్న ఇతర నేతలు విస్తుబోయారు. గవర్నర్ రాధాక్రిష్ణన్ మొఖం తెల్లబోయింది. ఏక్ నాథ్ షిండే తీరు చూసిన బీజేపీ ముందే జాగ్రత్త పడినట్లు కనపిస్తోంది. ఇప్పటికే కీలకమైన 20 మంత్రి పదవులను పక్కన పెట్టింది.షిండే హోం శాఖ, నీటిపారుదల, పరిశ్రమలు, పబ్లిక్ వర్క్సు శాఖలను తమకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే హోం శాఖ ఫడ్నవిస్ దగ్గరే ఉంటుందన్నది తేటతెల్లమైంది. శివసేన వర్గం కోసం 12 మంత్రి పదవులను బీజేపీ సిద్ధంగా పక్కన పెట్టింది.కానీ ఏక్ నాథ్ ఏం డిమాండ్ చేయబోతున్నారన్నది చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com