34.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

బెంగళూరులో లింగాయత్ స్వామి విగ్రహం ధ్వంసం

జీసస్ కలలో చెప్పాడంటూ ఆకతాయి జవాబు

కర్ణాటకలో హిందూ విగ్రహం ధ్వంసం కావడం కలకలం రేపుతోంది. బెంగళూరులోని శిద్ధ గంగా మఠానికి చెందిన లింగాయత్ స్వామి శివకుమార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నవంబర్ 30 నజరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. శ్రీ క్రిష్ట అనే 37 ఏళ్ల డెలివరీ బోయ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణ లో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతగాడు ఇచ్చిన వివరణ చూసి ఖంగు తిన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీక్రిష్ణ కర్ణాటకలోని ఓ కంపెనీలో డెలివరీ బోయ్ గా పనిచేస్తున్నాడు. తనకు కలలో జీసన్ కనిపించి ఇచ్చిన స్ఫూర్తితో విగ్రహాన్ని ధ్వంసం చేశానని తెలిపాడు. నవంబర్ 30న అర్ధరాత్రి శ్రీక్రిష్ణ బెంగళూరులోని వీరభద్ర నగర్ లో ఉన్న ఈ విగ్రహం దగ్గరకు చేరుకున్నట్లు విగ్రహం నుదుటిని పాక్షికంగా ధ్వంసంచేసి ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నట్లు తెలుస్తోంది .ఉదయం స్థానికులు ఈ నష్టాన్ని గుర్తించారు. దీనిపై స్థానికంగా నిరసనలు, ఆగ్రహావేశాలు మిన్నంటాయి. సకాలంలో స్పందించిన పోలీసులు అతగాడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ దుర్ఘటనను ఆర్చి బిషప్ డాక్టర్ పీటర్ మెకాడో తీవ్రంగా ఖండించారు. నిందితుని చర్య మత కలహాలు రెచ్చగొట్టడానికేనని ప్రజలు వీటిని నమ్మవద్దని పిలుపునిచ్చారు. శాంతికి, సమభావానికి, సామరస్యతకు మారుపేరైన శివకుమార్ స్వామి విగ్రహం ధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదని,ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పీటర్ కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com