33.7 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణ

ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాస రాజు, చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్​ను సిద్ధం చేశారు. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ యాప్‌ ద్వారా దరఖాస్తుదారుల వివరాలు సేకరించారు. ఇందులో ఎలాంటి సమస్యలు రాకపోవడంతో అధికారికంగా ఈ యాప్​ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినా సమగ్ర కుటుంబ సర్వే కారణంగా పెండింగ్​లో పెట్టారు. ఇప్పుడు సీఎం చేతుల మీదుగా యాప్‌ ప్రారంభించగానే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com