హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్లో హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు. కాసేపట్లో ప్రీమియర్ షో ప్రారంభమవుతుందనగా ఒక్కసారిగా బన్నీ అక్కడ ప్రత్యక్ష మయ్యాడు. దీంతో, అభిమానులు ఉక్కిరిబిక్కిరయ్యారు. బన్నీ అంటూ నినాదాలు చేశారు. ఫ్యాన్స్ సందడి గమనించిన అల్లు అర్జున్ కారులోంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. కారు టాప్ పైకి ఎక్కి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఆ సమయంలో ఫ్యాన్స్ బన్నిపైకి కాగితాల వర్షం కురిపించారు. మరోవైపు.. అభిమానులు బన్నీతో షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు కూడా పోటీ పడ్డారు. ఆ తర్వాత సంథ్య థియేటర్‌లోపలికి వెళ్లి అర్థరాత్రి సమయంలో సినిమా చూశారు. అయితే, అల్లు అర్జున్ లోపల సినిమా చూస్తున్న సమయంలోనే థియేటర్ బయట విషాదం చోటు చేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో మరణించింది. ఆమె కుమారుడు వెంటిలెటర్‌పై చికిత్స పొందుతున్నాడు.