తెలుగు రాష్ట్రాల్లో పుష్ప ఫీవర్ నెలకొంది. థియేటర్లన్నీ బన్నీ భజన చేస్తున్నాయి. ఏ సినిమా థియేటర్‌లో చూసినా అర్థరాత్రి ఫ్యాన్స్ సందడే కనిపిస్తోంది. జై బన్నీ నినాదాలే వినిపిస్తున్నాయి. తెల్లవారకముందే సినిమా చూడాలన్న తాపత్రయం బన్నీ అభిమానుల్లో కనిపిస్తోంది. అందుకే కొన్ని చోట్ల తొక్కిసలాటలు జరుగుతున్నాయి. పోలీసులు అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. అటు.. సినిమా హాళ్లలో గూస్‌బంప్స్ వస్తున్నాయి.