బుధవారం ఉదయం తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం ప్రభావంతో ములుగు జిల్లా మేడారంలోనూ భూమి కంపించింది. కొన్ని సెకనుల పాటు గద్దెల వద్ద కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. పక్కనే ఉన్న ములుగు కేంద్రంగా భూకంపం సంభవించగా.. మేడారం క్షేత్రంలోనూ ఆ ప్రభావం కనిపించింది. అయితే, సమ్మక్క, సారలక్క గద్దెల దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అక్కడున్నవాళ్లు కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయానికి గురయ్యారు. తర్వాత సర్దుకున్నారు.