కాకినాడ పోర్ట్‌లో జరుగుతున్న ఎగుమతుల వ్యవహారంపై మాజీ మంత్రి పేర్నినాని సంచలన ఆరోపణలుల చేశారు. ఈ పోర్ట్ నుంచి ఆర్థికమంత్రి వియ్యంకుడు బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం పోర్ట్‌కు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కెన్‌స్టార్ షిప్‌ను ఎందుకు చూడలేదని ప్రశ్నించారు. ఆ షిప్లో రేషన్ బియ్యం లేవా? అని పేర్ని నిలదీశారు. స్టెల్లా షిప్‌ను తనిఖీ చేసి, కెన్‌స్టార్ షిప్‌ని ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిజాయతీగా కాకినాడ పోర్ట్‌కు వెళ్లి తనిఖీ చేశారని పేర్ని నాని ప్రశంసించారు. కానీ, తన సందేహాలకు సమాధానాలు చెప్పాలన్నారు. షిప్‌లోకి వెళ్లాలంటే అనుమతి ఇవ్వాల్సిన ఇద్దరు అధికారులు పవన్ వెంటే ఉన్నారన్న పేర్నినాని.. ఆయనను వెళ్లనివ్వనిది ఎవరని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వని అధికారులు కలెక్టర్‌ను ఎందుకు వెళ్లనిచ్చారని ప్రశ్నించారు. స్టెల్లా చుట్టే ఎందుకు చక్కర్లు కొడుతూ షూటింగ్ చేశారన్నారు. కెన్‌స్టార్ షిప్ దగ్గరికి కూడా వెళ్లాలి కదా? అని ఆయన అడిగారు. చంద్రబాబు వెళ్లొద్దని అన్నాడా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. నిజాయతీగా తనిఖీలు చేశారా? లేక ఏదో జరుగుతుంటే వైఎస్ జగన్‌పై బురద చల్లాలని అనుకుంటున్నారా? అని పవన్‌ను పేర్ని నిలదీశారు.
- Advertisement with us -