ఫెంగల్ తుఫాన్ కారణంగా శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్ధ ప్రకటించింది. ఫెంగల్ తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో పశ్చమ వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. ప్రస్తుతానిక పుదుచ్చెరికి 150 కిలోమీటర్లు, చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో ఫెంగల్ కేంద్రీకృతం అయినట్లు తెలియజేశారు. శనివారం సాయంత్రానికి కారైకల్, మహాబలిపురంల మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరందాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావం వల్ల నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ హెచ్చరించింది.
- Advertisement with us -