– ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతర్జాతీయ సమావేశంలో పలువురు వక్తలు
ఈ వెస్ట్ మేనేజ్ మెంట్ లో గత మూడు దశాబ్దాలుగా చేసిన పరిశోధనలో 2022 చివరి నాటికి ప్రపంచంలో 66 బిలియన్ టన్నుల ఈ వెస్ట్ ఉత్పత్తి కాగా, ఇందులో 31 బిలియన్ టన్నుల మెటల్స్ , 21 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ వేస్టేజ్ మరొక 14 బిలియన్ టన్నుల మెటీరియల్స్ వెస్టీజ్ ఉందని, ఏటా 2. 6 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వెస్టీజ్ ఉత్పత్తి కావడం వలన భూమి, సముద్రాలూ, నదులు, చెరువులు అన్నీ కూడా కలుషితం అవుతున్నాయని వచ్చే రెండవ తరానికి ఈ వేస్టేజ్ తప్ప మనం భూమి మీద పండించే ఆహార పదార్థాలు ఏమీ ఉండవని ప్రముఖ వైద్యులు, పరిశోధకులు డాక్టర్ భక్తియార్ చౌదరి అన్నారు.
గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా లో ఇన్నోవేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మీద రెండు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సమావేశంలో శుక్రవారం నాడు డాక్టర్ భక్తియార్ మాట్లాడుతూ ప్రపంచానికి ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా జరుగుతున్న నష్టం అపారంగా ఉందన్నారు. ఇందుకోసం గ్రీన్ కల్టివేషన్ మాత్రమే భవిష్యత్ తరాన్ని కాపాడుతుందని డాక్టర్ భక్తియార్ చౌదరి అన్నారు. ఇటీవలి లెక్కల ప్రకారం ఇండియాలో 1.2 బిలియన్ మొబైల్ ఫోన్లు ఉన్నాయని, వీటిలో 69 బిలియన్లు స్మార్ట్ ఫోన్లు కాగా, ప్రపంచం మొత్తంలో మొబైల్ ఫోన్ల వినియోగం ఇండియాలోనే ఎక్కువగా ఉందన్నారు. డిఫెన్స్ లో మేజర్ హోదాలో పనిచేసిన తాను ఈ ప్రమాదాన్ని గుర్తించి ఇప్పటివరకు స్వయంగా రెండు లక్షల మొక్కలను నాటానని, భవిష్యత్తులో వీటి వేర్ల ద్వారా ఒక పది లక్షల చెట్ల వరకు ఎదుగుతాయన్నారు. ఎలక్ట్రానిక్ వెస్టీజ్ లో 42 శాతం గృహాల్లో నుండి వస్తుంటే 17 శాతం ఐటీ రంగం నుండి వస్తుందని, అత్యధికoగా చెట్లను నాటి వృక్ష సంపదను పెంచితే గానీ భూతాపం నుండి రక్షించుకోలేమన్నారు
సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బివిఆర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో భూమిలో దొరికే ఖనిజాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయన్నారు. ఇనుము, మాంగనీస్,టిటీనియం మైకా, లైమ్ స్టోన్ తదితర మినరల్స్ ను వెలికి తీయాలంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా కోట్లాది టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నామన్నారు. ఇలాంటి అంతర్జాతీయ సమావేశాల ద్వార సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చన్నారు. కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ జి, రామేశ్వర్ రావు మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాల కాలంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా అనేక జాతీయ అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించిందని, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే మేధావులు పరిశోధకులు హాజరయ్యే ఈ సమావేశాల ద్వారా వచ్చే ప్రతిపాదనలు, సిఫార్సులను ను ప్రభుత్వాలకు పంపిస్తామన్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఇంజనీరింగ్ మరియు సాంకేతికత రంగంలో సాధించాల్సిన అంశాలపై గురువారం, శుక్రవారం జరిగిన రెండు రోజుల సమావేశాల్లో దేశం లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వక్తలు అనేక విషయాలపై ప్రెసెంటేషన్స్ ఇచ్చారు. డీప్ సీ మైనింగ్ పై డాక్టర్ వి. బలరాం, నేవిగేటింగ్ పై డాక్టర్ ఆర్. ఎన్ . శుక్లా , వాటర్ క్వాలిటీస్ పై డాక్టర్ హరి సర్వోత్తమ్ , జియో స్పెషియల్ పై డాక్టర్ గుమ్మలూరి కృష్ణ, పర్యావరణం పై ప్రొఫెసర్ జయ కుమార్, క్వాలిటీ ఎయిర్ పై డాక్టర్ టి,వి. రజనీకాంత్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పై డాక్టర్ ఎస్.ఎం.పూజ, రిమోట్ సెన్సింగ్ పై డాక్టర్ హరి ప్రసాద్, ఆటోమేషన్ పై డాక్టర్ కె. శ్రీనివాస్, ఇన్నోవేషన్స్ ఇన్ మైనింగ్ పై డాక్టర్ మహేష్ కుమార్, ఎలెక్ట్రిక్ వెహికల్స్ పై మౌనిక శ్రీ , ఇండస్ట్రియల్ ఫ్లోర్స్ పై పి . నవీన్ భూగర్భ జలాల కలుషితంపై డాక్టర్ వి. రామకృష్ణ, ఎనర్జీ పవర్ పై మౌనిక చక్రవర్తి, ఇంకా డాక్టర్ ఉమాపతి, డాక్టర్ ప్రణీత్ రావు, డాక్టర్ రమేష్ కన్నెగంటి, అమర్ నాథ్, విద్యాసాగర్, ప్రశాంత్, కృష్ణ మోహన్ రావు, లక్ష్మి కాంత రావు పలువురు ఇంజనీరింగ్ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.