టీమ్ ఇండియా హిస్టారికల్ విక్టరీ.. కంగారుల సొంతగడ్డైన పెర్త్‌లో ఆసీస్‌కు ఎర్త్ పెట్టినట్టైంది. ఇప్పుడు టీమ్ ఇండియా ప్లేయర్ల ర్యాంకింగ్స్ కూడా మెరుగయ్యాయి. ముఖ్యంగా జప్ప్రీత్ బుమ్రా, యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపారనే చెప్పాలి. ఐసీసీ విడుదల చేసిన తాజా జాబితాలో టెస్టు బౌలర్ల లో బుమ్రా.. 2 ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. పెర్త్ టెస్టులో బుమ్రా (8/72) స్కోర్ తో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో బుమ్రా 883 పాయింట్లతో కెరీర్ లో బెస్ట్ సాధించాడు. బుమ్రా తర్వాత రబాడా, హాజిల్‌వుడ్, అశ్విన్ ఉన్నారు.
ఇక బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే పెర్త్ టెస్టుకు ముందు 4వ స్థానంలో ఉన్న జైస్వాల్.. ఆ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో రెండు ర్యాంక్‌లు పైకి ఎగబాకాడు. రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా జైస్వాల్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఆ తర్వాత విలియమ్సన్, బ్రూక్, మిచెల్ వరుసగా 3,4,5 ర్యాంక్‌ల్లో ఉన్నారు. రిషభ్ పంత్ 6వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక తొలి టెస్టులో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ఏకంగా 9 ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని 13వ ర్యాంక్‌కు చేరాడు.