29.1 C
Hyderabad
Tuesday, November 3, 2026

Live Video

spot_img

ఆ ప్రాంతాలు మావేనంటూ చైనా దొంగ నాటకం !!

  • అరుణాచల్‌ లోని ఈశాన్య ప్రాంతాలపై చైనా కన్ను
  • అది మాదేనంటూ చైనా తాజా మ్యాప్
  • తిప్పికొట్టిన భారత్.. చైనాకిది మామూలేనని కామెంట్‌
  • టిబెట్‌ లోభూభాగం తమదేనంటూ చైనా రుబాబు
  • అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ డ్యామ్ నిర్మాణానికి యత్నం
  • చైనాతో నిరంతరం సరిహద్దు తగాదాలు
  • నదీ జలాల వివాదాలతో చికాకు పెడుతున్న చైనా
  • ప్రపంచంలోకే పెద్ద డ్యామ్ నిర్మాణానికి సన్నాహాలు
  • అదే జరిగితే దిగువ దేశాలు తుడిచి పెట్టుకు పోయే ప్రమాదం
  • చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఎక్కౌంట్ బ్లాక్
  • తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నందుకు నిర్ణయం

ఉగ్రదాడులతో పెడదారి పట్టిన పాకిస్థాన్ ను సమర్ధిస్తూ వస్తున్న చైనా ఇప్పుడు మన దేశంలో పాత వివాదాన్ని పైకి లేపుతోంది. అరుణా చల్ ప్రదేశ్ ను తన భూభాగంగా చెప్పుకుంటున్న చైనా ఈశాన్య రాష్ట్రంలోని వేర్వేరు జల్లాల పేర్లు మార్చుతూ రకరకాల కొత్త మ్యాప్ లు విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఇదే కుటిల యత్నానికి పాల్పడింది. అయితే దీనిని భారత్ గట్టిగా ఖండించింది.అరుణా చల్‌ ను టిబెట్ దక్షిణ భాగంగా చెప్పుకుంటున్న చైనా దాని పేరు జంగ్నన్ అని మార్చింది. అరుణా చల్ లో కొన్ని ప్రదేశాల పేరు మార్పుకు చైనా తాజాగా చేసిన ప్రయత్నాన్ని మన విదేశాంగ శాఖ గట్టిగా తిప్పికొట్టింది. ఇవన్నీ వృథా ప్రయత్నాలని, ఆ ప్రాంతాలన్నీ అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ భారత్ పరిధిలోనివేనని స్పష్టం చేసింది.చైనా అలా ఎప్పుడూ దబాయిస్తూనే ఉంటుందని, ఆ దబాయింపుకు విలువలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు.పేర్లు ఎంత సృజనాత్మకంగా మార్చినా అరుణాచల్ ప్రదేశ్ ఎన్నటికీ భారత అంతర్భాగమేనని జైశ్వాల్ పునరుద్ఘాటించారు. భారత చైనా సరిహద్దులపై ఎప్పటినుంచో తగాదాలు నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే టిబెట్ కు చెందిన స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతముంది. దానిని చైనా టిబెట్ భూభాగమని చెబుతూ వస్తోంది. అయితే 1947 నాటి కాలం నుంచే అరుణా చల్ ప్రదేశ్ మన దేశంలోని భూభాగం.

నదీ జలాల వివాదాలు

అరుణా చల్ ప్రదేశ్ ప్రాదేశిక భూ భాగంలో ఎప్పటినుంచో నదీ జలాల వివాదం నడుస్తోంది. చైనా ఇప్పుడు ఆ భూభాగంలో ఉన్న యార్లంగ్ త్సాంగ్ పో నదిపై ప్రపంచంలోకే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ డ్యామ్ ను నిర్మించాలని ప్రయత్నిస్తోంది. టిబెట్ లోని మెడాగ్ ప్రాంతంలో ఉన్న ఇది సరిగ్గా నది మలుపు తిరిగి మనదేశంలోకి అడుగు పెట్టే కీలక ప్రాంతంలో ఉంది.దీనినే సియాంగ్ నదిగా పిలుస్తారు. అది మన దేశంలోకి అడుగు పెట్టాక మనం దానిని బ్రహ్మపుత్రానదిగా పిలుస్తాం. అది అసోంలో ప్రవహిస్తుంది.చైనా చేస్తున్న ఈ ప్రయత్నాన్నే తపీర్ గావో అనే బీజేపి యూనిట్ చీఫ్‌ వాటర్ బాంబ్ ప్రయోగంగా అభివర్ణించాడు.

ఇటువంటి ప్రయోగాలు వరదలు, ప్రళయాలు వచ్చినప్పుడు వికటించి దేశం ఉత్తరభాగం మొత్తం మునిగిపోయే ప్రమాదముంది. 2000ల సంవత్సరం జూన్ లో ఇలాంటి వరదల వల్లనే అరుణాచల్ ప్రదేశ్ లో మనవి పది బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. భవిష్యత్తులో ఈ డ్యామ్ నుంచి చైనా నీటి విడుదల పెత్తనం పెడితే మన అసోం, బంగ్లాదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య దేశాలు నాశనమవడం ఖాయం అని  బీజేపి ఎంపీ హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే అరుణాచల్ ప్రదేశ్ లో దిగువ నది నీటి ఉథృతిని పర్యవేక్షించడానికి ఒక డ్యాం నిర్మించక తప్పదని అన్నారు. డ్యాం కడితే చైనా ఒకేసారి నీటిని వదిలినా.. మన డ్యాం ద్వారా దాని ఫ్లోని కొంత వరకూ తగ్గించవచ్చని ఆయనన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com