28.1 C
Hyderabad
Monday, October 26, 2026

Live Video

spot_img

పార్టీ తీరు పట్ల కవితలో అసంతృప్తి ఉందా…?

  • సంచలనంగా మారుతున్న కవిత కామెంట్స్
  • తనపై విమర్శలు చేస్తే పార్టీ మౌనం వహిస్తోందని వ్యాఖ్య
  • తనకు రక్షణగా పార్టీ రావాలంటున్న కవితలు
  • కవితను దూరంగా పెడుతున్నారన్న ఊహగానాలు
  • తాను పార్టీ కోసమే పని చేస్తున్నాను అంటున్న కవిత

బిఆర్ఎస్ లో ఆమె కీలక నేత. స్వయనా ఆ పార్టీ అధినేత కుమార్తె. ఆమెవరో మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఆమో మరెవరో కాదు… ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇటీవల కాలంలో ఆమె చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. పార్టీలో చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా లిక్కర్ కేసులో ఆమె జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో మళ్ళీ కవిత యాక్టివ్గా తిరుగుతున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. పార్టీ పర్యటనలతో పాటు. తెలంగాణ జాగృతి పేరిట కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అయితే కవిత చేస్తున్న విస్తృత పర్యటనలు బీఆర్‌ఎస్‌ కు మేలు చేస్తున్నాయో… కీడు చేస్తున్నాయో అర్ధం కాక పార్టీ సీనియర్లు, క్షేత్ర స్ధాయి కార్యకర్తలు తలు పట్టుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఒక అంశం ఎంచుకుని ప్రభుత్వం పాయిట్‌ బ్లాంక్‌ రేంజ్‌ లో దాడి చేస్తూ ఉంటే కవిత మరొక అంశంతో మీడయా ముందుకు వస్తున్నారనే వాదన పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇది మంచి పరిణామం కాదనేది పార్టీ సీనియర్‌ నేతల వాదన. ఇప్పుడున్న పరిస్ధితుల్లో పార్టీ ఏకతాటిపైన నడవాల్సిన ఆవసరం ఎంతైనా ఉందని అనుభవజ్ఞులు చెపుతున్నారు. అయితే కవిత మాత్రం తాను ప్రజల్లో, పార్టీ క్యాడర్‌ లో ఉన్న అంశాలనే ప్రస్తావిస్తున్నానని, బీఆర్‌ఎస్‌ తిరిగి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అదే నేను వినిపిస్తున్నానని సమర్ధించుకుంటున్నారు. పైగా కొంతమంది నాయకులు తనను టార్గెట్‌ గా చేసి మాట్లాడుతుంటే పార్టీ నుంచి కౌంటర్‌ రావడం లేదని కవిత ఆవేదన వ్యక్తంచేస్తు్న్నారు.

నిజానికి బీఆర్‌ఎస్‌ పార్టీలో ఈ వివాదాలు కొత్తవి కావు. టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజమాబాద్‌ నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల కవిత ఓటమి పాలైంది. అప్పటినుంచి ఆమెకు పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిందని కొన్ని విషయాలో కెసిఆర్, కేటీఆర్లు సైతం ఆమె అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం లేదని అప్పట్లోనే ప్రచారం బాగా జరిగింది. సోషల్ మీడియాలో కూడా వీటికి సంబంధించి అనేక ఊహాగానాలు జోరుగా జరిగాయి. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు అయిన తర్వాత ఇవి మరింత బలపడ్డాయి.

నిజానికి ఉద్యమ కాలం నుంచి మొదలుకొని అధికారంలో ఉన్న 2023 వరకు బిఆర్ఎస్ కు సంబంధించి పెద్ద నాయకులే ఎవరు ఇలాంటి కేసుల్లో జైలుకు వెళ్లలేదు. విమర్శలు ఆరోపణలు వచ్చినప్పటికీ అవి అరెస్ట్ వరకు వెళ్లలేదు. బిఆర్ఎస్ లో పెద్ద నాయకులు ఎవరైనా అరెస్టు అయ్యారు అంటే అది కవిత అనే చెప్పుకోవాలి. అయితే ఆమె అరెస్టు సందర్భంగా పార్టీ మొత్తం ఆమెకు అండగానే నిలిచింది. రెగ్యులర్ గా కేటీఆర్ హరీష్ రావులు జైల్లో కవితను పరామర్శించడంతోపాటు న్యాయపరమైన వ్యవహారాలన్నీ స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు.

ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కవిత మాత్రం చాలా రోజుల నుంచి తన విషయంలో పార్టీ ఎక్కడో కొంత నిర్లక్ష్యంగా కానీ పట్టించుకోకపోవడం లాంటివి కానీ జరుగుతున్నాయని అభిప్రాయంతో ఉన్నట్టుగా ఆమె సన్నిహితులు కూడా చెపుతున్నారు. ఈ క్రమంలో స్వయంగా కొన్ని కార్యక్రమాలను ఖరారు చేసుకుని ఆమె దారిన ఆమె పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తోంది. ఇది కొంత మేరకు పార్టీకి ఇబ్బందికర పరిస్ధితులు కలిగిస్తోందనేది సీనియర్‌ నేతల వాదన. అయితే తాను పార్టీ కోసమే 47 నియోజకవర్గాల్లో పర్యటించానని ఆమె సమర్ధించుకుంటున్నారు. పార్టీ ప్రయోజనం కోసమే తాను పర్యటనలు  చేస్తున్నానని మరే ఉద్దేశం తనకు లేదని ఆమె వివరణ కూడా ఇచ్చారు. అయితే తన విషయంలో అసత్య ప్రచారాలు ఆరోపణలు జరుగుతున్న పార్టీ నుంచి స్పందన వస్తుందని ఎదురుచూస్తున్నట్లుగా ఆమె చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.

బిఆర్ఎస్ కు సంబంధించి ఇద్దరు టాప్ లీడర్స్ కేటీఆర్, హరీష్ రావులు వివిధ సబ్జెక్టులపై ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కవిత కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం ద్వారా బి ఆర్ఎస్ ఎంచుకున్న ఇతర అంశాల విషయంలో కొంత గందరగోళం ఏర్పడుతోందనే అభిప్రాయం బీఆర్‌ఎస్‌ లో సర్వత్రా నెలకొంది. అయితే వివాదాలు ఏమీ లేవని ఆల్ ఈజ్ వెల్‌ అని చెప్పుకొచ్చే ప్రయత్నం నేతలు చేస్తున్నప్పటికీ కవిత మాత్రం ఎక్కడో కొంత ఆసంతృప్తిగా ఉన్నట్టుగా ఆమె వ్యాఖ్యల ద్వారా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com