22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

ఇండో-పాక్ ల మధ్య ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి

  • ఉగ్రవాదానికి చైనా వ్యతిరేకం…
  • చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్‌ పాకిస్తాన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులు తీవ్ర ఆందోళణ కలిగిస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ అన్నారు. శుక్రవారం చైనా భారత్‌ పాక్‌ మధ్య నెలకొన్ని యుద్ద వాతావరణంపై స్పందించింది. ఉగ్రవాదాన్ని తమ దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చైనా ప్రకటించింది. ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా దానికి చైనా వ్యరేతికమని లిన్‌ జియాన్‌ స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి భారత్‌, పాక్‌ లు శాంతి కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. పరిస్ధితులు మరింత క్లిష్టంగా మారకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాలని జియాన్‌ కోరారు. ఇరు దేశాల మధ్య ఉద్రికత్తుల తగ్గించడానికి నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి చైనా సిద్దంగ ఉందని లిన్‌ వెల్లడించారు. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా గతంలో స్పందించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. అయితే ముందుగా పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేసిన తరువాతే భారత సైన్యం ప్రతిదాడికి పాల్పడిందని ట్రంప్ ప్రస్తావన చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com