22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

పల్లెల్లో ఎన్నికల హడావుడి

మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైందంటూ ప్రచారం జరుగుతోంది.  తెలంగాణలో కులగణన డేటా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉండటంవల్లే ఎన్నికలు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రాగానే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు సమాచారం. జూలైలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికలకు సిద్దమయ్యింది.

బ్యాలెట్ బాక్సులను సమకూర్చుకుంది. ప్రభుత్వం నుండి ఆదేశాలు వెలువడగానే షెడ్యూల్ విడుదలచేసి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జూన్ చివర్లో లేదంటే జూలై ఆరంభంలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు కొద్దిరోజుల వ్యవధిలోనే నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయితీ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించి  కేవలం 15-20 రోజుల్లో ఈ ప్రాసెస్ ను పూర్తిచేయాలని… మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను కూడా ఇలాగే తక్కువ సమయంంలో పూర్తిచేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇలా ఒకే విడతలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను ఈసి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. బిల్లు ఆమోదం పొందితే.. తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయి.. ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితిని దాటుతుంది. ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. తద్వారా న్యాయ సమీక్ష నుండి రక్షణ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. బిల్లు ఆమోదం పొందితే, తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పెరుగుతుంది. తెలంగాణలోని 540 మండలాల పరిధిలో ఉన్న 12,966 గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 1,14,620 వార్డులకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన జాబితాను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. గత ఎన్నికల్లో 535 మండలాల్లోని 12,732 గ్రామాల్లో 1,13,152 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈసారి అదనంగా 5 మండలాలు, 234 గ్రామాలు, 1,468 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com