35.2 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img

భారత సైన్యానికి దన్నుగా కంచి కామకోటి పీఠం

కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు, శ్రీమత్పర మహంస పరివ్రాజకాచార్యవర్యులు, జగద్గురువులు పరమపూజ్య శ్రీశంకరాచార్య శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు, తదంతేవాసులు శ్రీశ్రీశ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివార్ల నుండి ముఖ్య సందేశం వెలువడింది.  భారత సైన్యం శత్రు దేశంలోని ముష్కరులను తుదముట్టిస్తున్న వేళ… భక్తులు, ప్రజలు వారికి మద్దతుగా నిలవాలని పిలుపు ఇచ్చారు. దేశవ్యాప్తంగా గృహాలలో నిత్యానుష్ఠానాలలో, సమీప దేవాలయాలలో చేయవలసిన కార్యక్రమాలను వెల్లడించారు.

1. యుధిష్ఠిరుడు అలాగే అర్జునుడు చేసిన దుర్గా స్తుతి
2. అయ్యప్ప దీక్షల్లో ఉన్నవారు దుర్గా చంద్రకళా స్తుతి
3. లింగపురాణంలో శ్రీ మహా విష్ణుకృత శివసహస్ర నామస్తోత్రం

దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఆవరించిన వేళ
అఖండభారత సుస్థిరత్వ సిద్యర్థం
ఆర్షధర్మజన సౌభ్రాతృత్వ సిద్యర్థం… సర్వేషాం సనాతన ధర్మసముపార్జనార్థం

భారతీయానామ్ ఐక్యతా సిద్యర్థం శత్రుమూక వినాశనార్థం

అని సంకల్పం చేసి పూజ, పారాయణం చేయవలసిందిగా కంచి కామకోటి పీఠాధిపతులు భక్తులను ఆదేశించారు. వాయువ్య భారతంలో త్రివిధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్ధతుగా నిలవాలని భక్తులకు పిలుపు ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com