27 C
Hyderabad
Monday, June 29, 2026

Live Video

spot_img

రేపే అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్‌

  • అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాక్ డ్రిల్
  • రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
  • యుద్ధ సన్నదతలో భాగంగా మాక్ డ్రిల్

పహల్గామ్‌ ఉగ్రదాడి తదనంతర పరిణామాల్లో భారత్‌ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించమని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మే 7వ తేదీన అన్ని రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఇది దేశ ప్రజలను యుద్దానికి సన్నద్దులను చేయడంలో భాగంగా చూడాలి. ఎయిర్‌ స్ట్రైక్స్‌ గురించి అప్రమత్తం చేసే సైరన్ల వ్యవస్ధను పనిచేసేలా చూడాలని, అలాగే యుద్ద సమయంలో ప్రజలు స్వీయ రక్షణ ఎలా చేసుకోవాలో అవగాహన కల్పించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే అంశంపై పౌరుల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల 7వ తేదీన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు హోంగార్డులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, నెహ్రూ యువకేంద్రం వాలంటీర్లు, యువకులు, విద్యార్థినీ విద్యార్థులు, సివిల్‌ డిఫెన్స్‌ వార్డెన్లు యుద్ద సమయంలో ఎలా స్పందించాలో ఈ మాక్‌ డ్రిల్ ద్వరా అవగాహన కల్పించాలని కోరారు. వైమానిక దాడులు జరిగితే ఎలా స్పందించాలి, సైరన్‌ మోగించి సామాన్య పౌరులను ఎలా అప్రమత్తం చేయాలో తెలియజేయడానికి ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహంచాలని కేంద్రం కోరింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న కీలకమైన ఫ్యాక్టరీలు, ఇతర ప్రభుత్వ భవనాలు, ముఖ్యమైన భవంతులు బహిరంగంగా కనిపించకుండా ఎలా చేయాలి, అలాగే హుటాహుటీన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గాలను సిద్దం చేయడం తదితర విషయాలపై ప్రణాళికలు తయారు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. 1971వ సంవత్సరంలో జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్ కి ముందు ప్రజలను యుద్ద సన్నద్ధం చేయడానికి ఈ విధంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడే అన్ని రాష్ట్రాల్లో యుద్ద సన్నద్దతకు మాక్ డ్రిల్ నిర్వహించడం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com