36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

దోస్త్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొత్తం మూడు దశల్లో ఈ అడ్మిషన్ ప్రక్రియ సాగనుంది.

డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన ప్రధాన షెడ్యూల్ :

మొదటి దశ :

  • రిజిస్ట్రేషన్ తేదీలు : మే 3 నుంచి మే 21 వరకు
  • ఫీజు : రూ.200
  • వెబ్ ఆప్షన్లు : మే 10 నుంచి మే 22 వరకు
  • సీట్ల కేటాయింపు : మే 29
రెండో దశ :
  • రిజిస్ట్రేషన్ : మే 30 నుంచి జూన్ 8వ తేదీ వరకు
  • ఫీజు : రూ.400
  • వెబ్ ఆప్షన్లు : మే 30 నుంచి జూన్ 9వ తేదీ వరకు
  • సీట్ల కేటాయింపు : జూన్ 13
మూడో దశ :
  • రిజిస్ట్రేషన్ : జూన్ 13 నుంచి జూన్ 19వ తేదీ వరకు
  • ఫీజు : రూ.400
  • వెబ్ ఆప్షన్లు : జూన్ 13 నుంచి జూన్ 19వ తేదీ వరకు
  • సీట్ల కేటాయింపు : జూన్ 23
  • డిగ్రీ తరగతులు ప్రారంభం : జూన్ 30వ తేదీ నుంచి
ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
  • ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్‌ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దోస్త్ పరిధిలో ఉన్న యూనివర్సిటీలు :
  • ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన.
మొత్తం కళాశాలలు :
  • ప్రభుత్వ కాలేజీలు : 136
  • ప్రైవేట్ కళాశాలలు : 855
  • నాన్-దోస్త్ కాలేజీలు : 63
  • మొత్తం సీట్లు : 3,86,544
డిగ్రీలో అందుబాటులో ఉన్న కోర్సులు :
  • బీఏ, బీకాం, బీకాం (ఒకేషనల్/హానర్స్), బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ ఇతర కోర్సులు
Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com