37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

నిన్న సభలో కేసీఆర్‌ తన అక్కసు అంతా వెళ్లగక్కారు

  • కేసీఆర్‌ ప్రసంగంలో పస లేదు
  • రాహుల్ గాంధీకి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి
  • వేరే అప్షన్‌ లేకే అధికారులను కొనసాగిస్తున్నాం… సీయం రేవంత్‌

వేరే ఆప్షన్‌ లేకనే కొంత మంది అధికారులను కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అధికారులను ఉన్నపళంగా తీసేస్తే పాత విషయాలు ఎలా తెలుస్తాయని, అందుకే కొంత మందిని తప్పిని పరిస్ధితుల్లో కొనసాగిస్తున్నట్లు సీయం స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు వేరొకరు లేరని, ఓ దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరా గాంధీదే అని సీయం అన్నారు. మోడీ అయినా కేసీఆర్‌ అయినా వాళ్ళ అవసరాల కోసమే ఏమైనా మాట్లాడతారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌ లు ఏ రాష్ట్రంలో అములలో లేవని, చివరి ఆరు నెలలు వీటిపైన చర్చ జరుగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. నాకు రాహుల్‌ గాంధీకి మధ్య మంచి రిలేషన్‌ ఉందని… ఇది ఎవరూ నమ్మాల్సిన అసరం లేదన్నారు. కగార్‌ పై జాతీయ స్ధాయిల చర్చ జరగాలని ఈ విషయంపై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక మా ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు. నిన్న బీఆర్‌ఎస్‌ సభలో కేసీఆర్‌ తన అక్కడు మొత్తం కక్కాడని ఆయన ప్రసంగంలో పస లేదన్నారు. కేటీఆర్‌, హరీష్‌ రావులను పిల్లలు అని సంభోదించిన కేసీఆర్‌ మరి వాళ్ళనెందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారని సీయం ప్రశ్నించారు. సంవత్సరంన్నర కాలంలో అనేక పధకాలు తీసుకు వచ్చామని ఇప్పుడు వాటన్నింటినీ స్ట్రీమ్‌ లైన్‌ చేస్తామన్నారు. నేను కమిట్‌ అయిన అన్ని హామీలు నెరవేర్చి తీరుతానన్నారు. అద్దంకి దయాకర్‌ కి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పా ఇప్పించా అని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ సభకు ఆర్టీసీ బస్సులు కావాలని అడిగారు… ఎన్ని అడిగితే అన్న ఇవ్వమని చెప్పా, ఆర్టీసీకి ఆదాయం వస్తుందంటే వద్దంటామా అన్నారు. నేను మరో ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటానని, చట్ట ప్రకారమే నడుచుకుంటానని, విపక్ష నేతలను అరెస్టులు చేయమని డిమాండ్‌లు ఉన్నంతమాత్రాన అరెస్ట్‌ చేయలేమని సీయం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com