తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆదివారం దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.
ప్రస్తుతం చీఫ్ సెక్రెటరీగా వ్యవహరిస్తోన్న శాంతికుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆమె పదవీ కాలం ముగియబోతుండటంతో, ప్రభుత్వం ముందుగానే కొత్త సీఎస్ నియామక ప్రక్రియను పూర్తి చేసింది. శాంతికుమారి స్థానంలో త్వరలోనే రామకృష్ణారావు బాధ్యతలు చేపడతారు.
కె. రామకృష్ణారావు 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. సుదీర్ఘ అనుభవం, విశేష పరిపాలనా నైపుణ్యం కలిగిన ఆయన, పలు కీలక శాఖల్లో సేవలందించారు. ముఖ్యంగా ఆర్థిక శాఖలో చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఆయనకు రాష్ట్ర పరిపాలనలో అత్యున్నతమైన పదవి అప్పగించింది. ఈనెల 30వ తేదీన శాంతి కుమారి పదవీ విరమణ చేయగానే రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.