కశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతం, సమయం అన్నీ కూడా చాలా రోజులుగా ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరు గాంచిన బైసరన్ వ్యాలీ అనేది ఓ హిల్ స్టేషన్. అందుకే ఉగ్రవాదులు దాడి చేసేందుకు బైసరన్ వ్యాలీని వ్యూహత్మకంగా సెలెక్ట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. పహెల్‌గామ్ హిల్ స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. ఇక్కడికి ఏ వాహనాలు వెళ్లలేవు. కాలినడక మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. అందుకే మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు దాడి జరిగితే ఈ విషయం ప్రపంచానికి తెలిసేందుకు కాస్త సమయం పట్టింది. భద్రతా బలగాలు అక్కడికి చేరుకునే సమయానికి వారు అక్కడి నుంచి పరారయ్యారు.
మొత్తం ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు అక్కడికి వచ్చి దాడులు చేసి.. అందరికి వార్నింగ్‌లు ఇచ్చి అక్కడి నుంచి అడవుల్లోకి పరారయ్యారు. భద్రతా బలగాలు అక్కడికి చేరుకునే సమయానికి కూడా అక్కడి వారంతా ఓ భయానక వాతావరణంలోనే ఉన్నారు. భద్రతా బలగాలను చూసి కూడా వారు భయపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు వారి ఎలాంటి పరిస్థితిని కల్పించారో. గాయపడ్డవారిని, మృతదేహాలను తరలించేందుకు ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్లను ఉపయోగించింది. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు.. దాడికి వారు ఎంచుకున్న ప్రాంతం ఎంత వ్యూహాత్మకమో.
ఇక దాడి జరిగిన టైమింగ్ కూడా ఇక్కడ కీలకమే అని చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సౌదీ పర్యటనలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ మీడియా మొత్తం భారత్‌పై ఫోకస్ చేసి ఉంది. అలాంటి సమయంలో దాడి చేశారు ఉగ్రవాదులు. దీంతో వరల్డ్ వైడ్‌గా అటెన్షన్ గ్రాబ్ చేశారు.
అంతేకాదు ఇక్కడో మరో కీలక విషయం కూడా ఉంది. కొన్ని రోజుల క్రితమే పాక్ ఆర్మీ చీఫ్ కశ్మీర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఎప్పటికీ పాక్‌లో అంతర్భాగమే.. అక్కడ పోరాడుతున్నవారికి తమ మద్ధతు ఉంటుందని చెప్పారు. అంతేకాదు కశ్మీర్ అని తమ గొంతు దగ్గర ఉన్న సిర అంటూ మాట్లాడారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల్లోనే ఈ దాడి జరిగింది. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది దీని వెనక పాక్ ఆర్మీ హస్తం ఖచ్చితంగా ఉందని.