22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

దాడులను రికార్డు చేసిన ఉగ్రవాదులు.. NIA దర్యాప్తులో కీలక విషయాలు..

కశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించి ఒక్కొక్క విషయం బయటికి వస్తుంది. దాడులను ఎంత పక్కాగా ప్లాన్ చేశారంటే.. ఈ దాడికి సంబంధించిన ప్రతి విషయాన్ని రికార్డు చేశారు ఉగ్రవాదులు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొన్ని కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది.

ఉగ్రవాదులు ఎక్కువ మందిని గాయపర్చాలని ప్లాన్ చేసినట్టు గుర్తించింది NIA. టూరిస్టులపై దాడి చేయడానికి పాక్ నుంచి వచ్చిన టెర్రరిస్టులతో పాటు.. లోకల్ టెర్రరిస్టులు కూడా సహాయ పడ్డట్టు గుర్తించారు. ముందుగానే నిఘా వేసి.. ప్రతి సమాచారాన్ని తెలుసుకున్నారని.. భద్రత ఎక్కువగా లేని విషయం తెలుసుకొని దాడులు చేసినట్టు గుర్తించారు. అందుకే మారుమూల ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కువ మందిని గాయపర్చాలని అనుకున్నట్టు గుర్తించారు. అంతేకాదు వారికి సహాయం అందేసరికి చాలా సమయం పడుతుంది కాబట్టి.. వారి చనిపోయే ముందు నరకం చూపించాలని భావించినట్టు సమాచారం.

అంతేకాదు ఉగ్రవాదులు బాడీ కెమెరాలను ధరించినట్టు గుర్తించింది NIA. దాడికి సంబంధించిన ప్రతి విజువల్‌ను రికార్డ్ చేశారని తెలుసుకున్నారు. ముందుగా నలుగురు ఉగ్రవాదులు టూరిస్టులను తుపాకులతో బెదిరించి ఒక పక్కకు తీసుకొచ్చారు. వారిలో మహిళలు, పిల్లలు, పురుషులను వేరు చేశారు. ఆ తర్వాత కొందరు ఉగ్రవాదులు AK-47 గన్స్‌తో కాల్పులు జరపడం ప్రారంభించారు. కొందరిని దూరం నుంచి స్నైపర్ రైఫిల్స్‌తో కాల్చి చంపినట్టు తెలుస్తోంది. చనిపోయిన వారిలో చాలా మంది సరైన సమయంలో వైద్యం అందక.. తీవ్ర రక్తస్రావమై చనిపోయినట్టు తెలుస్తోంది.

దాడికి ముందే దట్టమైన అడవుల్లో చిన్న స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. కశ్మీర్‌లోకి చొరబడిన తర్వాత స్థానికంగా ఉన్న ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్ వారికి సహాయం అందించి ఉంటారని అనుమానిస్తున్నారు.

NIA ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తోంది. మరోవైపు ఫోరెన్సిక్, టెక్నికల్ ఎవిడెన్స్‌లను సేకరిస్తోంది. దాడుల సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న యాక్టివ్‌గా ఉన్న మొబైల్‌ నెంబర్స్ వివరాలను సేకరించినట్టు సమాచారం. మొత్తంగా ఉగ్రవాదులు ఎవరు? ఎంత మంది? అందులో పాకిస్థాన్ నుంచి వచ్చిన వారు ఎంతమంది? స్థానికులు ఎంత మంది? వారికి సహాయపడ్డది ఎవరు? భద్రతా వైఫల్యం ఎక్కడ జరిగింది? ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఈ దాడులను ఎందుకు గుర్తించలేకపోయాయి? ఇలా అన్ని అంశాలపై ఫోకస్ చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది NIA.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com