జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై అగ్ర రాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఉగ్రవాదుల దాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. భారత దేశానికి అమెరికా తరపున తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కశ్మీర్ సంఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు ట్రంప్. తీవ్ర వాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి, ఉగ్రవాదాన్ని పెకిలించి వేయడానికి భారత్ అనుసరిస్తున్న చర్యలకు అమెరికా బలమైన మద్దతు ఇస్తుందన్నారు. మరణించిన వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని ట్రంప్ ఆకాంక్షించారు. వాళ్ల కుటుంబాలకు ప్రగాఢ విశ్వాసం తెలియజేశారు. గాయ పడిన వాళ్లందరూ త్వరగా కోలు కోవాలని డోనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భారత దేశ ప్రజలకు అమెరికా తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.