తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మధిర మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు ప్రారంభించారు. అలాగే, పలు ఎత్తిపోతల పథకాలకు కూడా శంకుస్థాపనలు చేశారు.
అడుగడుగునా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు నీరాజనం లభించింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలువురు ఉప ముఖ్యమంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు తాపత్రయ పడ్డారు. ఆయా గ్రామాల్లో కలియ దిరిగిన డిప్యూటీ సీఎం శిలా ఫలకాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్య మాలిక భాస్కర న్యూస్ పాఠకుల కోసం….