తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఏడాది మార్చి 5వ తేదీ నుంచి 25 తేదీ వరకు పరీక్షలు జరిగాయి.
కాగా ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ ఫలితాలు ఈ నెల 12న విడుదల చేశారు. తెలంగాణలో విద్యాసంవత్సరం ఆలస్యం అవుతోందని, దీన్ని సవరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది ఫలితాల్లో కూడా బాలికల హవానే కొనసాగింది. ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఇంటర్ ఫస్టియర్లో 69.89 శాతం ఉత్తీర్ణత. ఇంటర్ సెకండియర్లో 71.37 శాతం ఉత్తీర్ణత. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం వారం రోజులు గడువు ఇచ్చారు. వచ్చే నెల మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి.