24.9 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

మే2న కేదర్ నాథ్, 4న బద్రీనాథ్ లో పూజలు ప్రారంభం

చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన కేదర్‌నాథ్‌, బద్రినాథ్‌ ఆలయాలు ప్రారంభానికి సిద్దం అయ్యాయి. మే 2వ తేదీన కేదర్‌నాథ్‌ ఆలయంలో ఉదయం పూజలు ప్రారంభం అవుతాయి. మే 4వ తేదీన బద్రీనాథ్‌ ఆలయంలో భక్తుల సందర్శనకు అనుమతిస్తున్నారు. ఈ మేరకు బద్రీనాథ్‌, కేదర్‌నాథ్‌ ఆలయ కమిటీ ప్రకటించింది.

బోళాశంకరుడి ఆలయాలైన 12 జ్యతిర్లింగాల్లో బద్రీనాథ్‌, కేదర్‌నాథ్‌ ఆలయాలు పవిత్రమైనవిగా భావిస్తారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలకు ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి భక్తులను అనుమతిస్తారు. ప్రతి ఏడాది చలికాలం రాగానే చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేస్తారు. గంగోత్రి, యమునోత్రి, కేదర్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాలకు భక్తులు వెళ్లటం దుర్లభంగా ఉంటుంది. ఈ సమయంలో ఆలయాలను మంచు కప్పేస్తుంది.

వేసవి ప్రారంభం కాగానే నాలుగు జ్యోతిర్లింగాలను వరుసగా భక్తుల సందర్శన కోసం అందుబాటులోకి తీసుకొస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి భారతీయులు చార్‌ధామ్‌ యాత్ర కోసం తరలివస్తారు. కొంతకాలంగా విదేశీ టూరిస్టుల రాక పెరిగిందని ఉత్తరఖండ్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com