22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

బిల్లుల విషయంలో సుప్రీం గడువుపై ఉపరాష్ట్రపతి ఆక్షేపణ

శాసనసభల ఆమోదం పొందిన బిల్లులు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదించడానికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ కర్‌ తీవ్ర ఆక్షేపణ వెలిబుచ్చారు. రాజ్యసభ ఇంటర్నల్‌ 6వ బ్యాచ్‌ ని ఉద్దేశించి ప్రశంగించిన ఉప రాష్ట్రపతి న్యాయస్ధానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్ధితి ఉండదంటూ వ్యాఖ్యానించారు. ఇదే గనుక జరిగితే రాజ్యాంగంలో ఆర్టికల్‌ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ప్రజాస్వామ్య శక్తులపై ఒక అణ్వాయుధాన్నే ప్రయోగించినట్లు అవుతుందని జగదీప్‌ ధనకర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సుప్రీంకోర్టు ఆర్టికల్‌ 142 అధికారన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్ధలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. అలాగే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో అగ్నిప్రమాదం సందర్భంగా నోట్ల కట్లలు వెలుగు చూసిన సంఘటనపై ఉపరాష్ట్రపతి ఈ సమావేశంలో స్పందిచారు. మార్చి 14, 15 తేదీల్లో న్యూఢిల్లీలోని ఒక న్యాయమూర్తి నివాసంలో ఒక సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ఏడు రోజుల వరకూ దేశంలో ఎవ్వరికీ ఈ విషయం తెలియదని ధనకర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనం ఎటువంటి పరిస్ధితుల్లో ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. ఈ సంఘటన కొన్ని ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు. దేశరాజధానిలో ఒక న్యాయమూర్తి నివాసంలో జరిగిన సంఘటన ఏడు రోజుల వరకూ ఎవరీ తెలియకపోవడం క్షమించదగినదా అని ప్రశ్నించారు. మార్చి 21వ తేదీన ఒక పత్రిక ఈ సంఘటనను రిపోర్ట్ చేసేంత వరకూ ఎవరికీ తెలియకపోవడం శోచనీయమన్నారు. ఈ విషయం తెలుసుకున్న దేశ ప్రజలందరూ ఎంతో షాకుకు గురయ్యారని అన్నారు. ఈ విషయంలో ఒక ఎఫ్‌ఐఆర్‌ లేకపోవడం, దర్యాప్తులో ఎటువంటి పురోగతి ప్రజలకు కనిపించకపోవడంపై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com