32.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

రాశిఫలాలు…13.04.25 నుండి 19.04.25 వరకు

మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక వ్యవహారాలలో మరింత వేగం పుంజుకుంటుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తుల విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సోదరులు, మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. భాగస్వాముల చేయూత మరింత అందుతుంది. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు శుభవార్తలు అందుతాయి. 13,14 తేదీల్లో మానసిక అశాంతి. ఒప్పందాలు వాయిదా. ఆకస్మిక ప్రయాణాలు.  శ్రీలలితాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

పనులు సకాలంలో పూర్తి చేయడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి నోచుకుంటాయి. కాంట్రాక్టర్లకు మరింత ఉత్సాహం. చర్చలు కొన్ని ఫలప్రదమవుతాయి.  ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. కుటుంబసమస్యలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులు సకాలంలో అందుకుంటారు. ఉద్యోగులకు వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. 18,19 తేదీల్లో కుటుంబంలో సమస్యలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

చాకచక్యంగా, నేర్పుగా వ్యవహరించి అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీపై ఆరోపణలు తొలగి ఊరట చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వేడుకల నిర్వహణకు ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. ఒక సమాచారంతో నిరుద్యోగులలో ఉత్సాహాన్నిస్తుంది. రావలసిన సొమ్ము కొంత అంది అవసరాలు తీరతాయి. కుటుంబ సభ్యులు మరింత ప్రేమానురాగాలు చూపుతారు. ఆరోగ్యసమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలు, కళాకారులకు అనూహ్యమైన అవకాశాలు. 14,15 తేదీల్లో మిత్రులతో కలహాలు. ఖర్చులు పెరుగుతాయి. వివాదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొంత పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. కొన్ని ఆహ్వానాలు అందుతాయి. మీలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. రావలసిన డబ్బు అందుతుంది. రుణాలు తీరతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. సోదరులు, బంధువుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. పెట్టుబడులు పెరిగి విస్తరిస్తారు. ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. 15,16 తేదీల్లో ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృథా ఖర్చులు. విష్ణుధ్యానం చేయండి.

సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. మిత్రుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితం అంతగా ఉండదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు చికాకులు పెరుగుతాయి. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు పడతారు. రుణాల కోసం మరింత యత్నిస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. శారీరక రుగ్మతలతో ఇబ్బందిపడతారు. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. పెట్టుబడుల్లో జాప్యం. ఉద్యోగులు అదనపు బాధ్యతలు మీదపడి ఉక్కిరిబిక్కిరి కాగలరు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు పెరుగుతాయి. 16,17 తేదీల్లో నూతన ఉద్యోగప్రాప్తి. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.

కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

ఎంతటి పనినైనా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. బంధువులతో చర్చలు సఫలం. చాకచక్యంగా కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో మీపై వచ్చిన విమర్శల నుంచి బయటపడతారు. అందరితోనూ సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణబాధల నుంచి విముక్తి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. కళాకారులు, రాజకీయవేత్తలకు అనుకూలమైన సమయం. 18,19 తేదీల్లో వివాదాలకు దూరంగా ఉండండి. కావలసిన వారితో విభేదాలు. వృథా వ్యయం. అంగారక స్తోత్రాలు పఠించండి.

తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

అనుకున్న పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. చర్చలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్ల యత్నాలు సఫలం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.దైవకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రుణాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం. కుటుంబ సమస్యలు క్రమేపీ తొలగుతాయి. సోదరీలు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో కోరుకున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పైస్థాయి వారి నుంచి సహాయసహకారాలు అందుతాయి. రాజకీయవర్గాల శ్రమ కొలిక్కి వస్తుంది. 14,15 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి ఒత్తిడులు. కొన్ని వివాదాలు నెలకొని ఇబ్బందిపడతారు. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి.  కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కుటుంబ సమస్యలు తీరి  ఊపిరిపీల్చుకుంటారు. సోదరుల నుంచి సహాయం అందుతుంది. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. 16,17 తేదీల్లో కీలక నిర్ణయాలలో మార్పులు. మానసిక అశాంతి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టర్లకు అనుకూల సమాచారం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. కష్టం ఫలించి ఫలితం పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతంగా కాగలవు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. రుణాలు తీరతాయి. కుటుంబంలో అందరితోనూ సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారులకు అనుకున్న లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. 18,19 తేదీల్లో గణేశ్​స్తోత్రాలు పఠించండి. కొన్ని వివాదాలు నెలకొని ఇబ్బందిపడతారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కుటుంబంలో సమస్యలు.

మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

పట్టుదల, ధైర్యంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో కొన్ని వేడుకలు క్లుప్తంగా నిర్వహిస్తారు. కొన్ని వివాదాలు తీరతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవేత్తలు, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. 17,18 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కావలసిన వారితో విభేదాలు. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. రాబడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తీరతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. కొద్దిపాటి ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు ఉంటాయి. ప్రమోషన్లు తథ్యం. కళాకారులు కృషి, పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. 13,14 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)

అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు మరింత వేగవంతంగా చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీలో సంతోషాన్నిస్తుంది. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. పెట్టుబడులకు లోటు ఉండదు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత అనుకూల సమయం. 14,15 తేదీల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు, సమస్యలు. కొన్ని నిర్ణయాలు వాయిదా. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com