25.1 C
Hyderabad
Tuesday, June 30, 2026

Live Video

spot_img

విదేశీయులంతా నెల్లాళ్లలోగా వివరాల నమోదు తప్పనిసరి

  • అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త రూల్
  • రెండో ప్రపంచ యుద్ధం నాటి రూల్ నే అమలు
  • అమెరికాలో ఉంటున్న విదేశీయులందరికీ ఇది వర్తింపు
  • లేదంటే 5వేల డాలర్ల జరిమానా, జైలు శిక్ష ఖాయం
  • ఫెడరల్‌ జడ్జి పరిశీలన తర్వాతే ఆదేశం అమలు ఉత్తర్వులు
  • ఇప్పటికే అక్కడ ఉంటున్న వారికి మినహాయింపు
  • ఏప్రిల్‌ 11 తర్వాత ఎవరు అమెరికా వచ్చినా ఇదే రూల్‌
  • ఇప్పటికే ఉన్నవారంతా డాక్యుమెంట్లు వెంట క్యారీ చేయాలి
  • మైనర్ల తల్లి దండ్రులు సైతం తమ వివరాల నమోదు
  • 14 ఏళ్లు దాటిన పిల్లలకూ ఇది వర్తింపు
  • ఏడు లక్షలమంది భారతీయులపై ఈ రూల్‌ ప్రభావం
  • అక్రమ వలసదారులు తమంత తాము వెనుదిరగాలి
  • అలా అయితే మళ్లీ అమెరికా వచ్చే ఛాన్స్
  • తప్పించుకో చూస్తే శాశ్వత నిషేధం

అమెరికాలో ఉంటున్న విదేశీ పౌరులు 30 రోజులు (నెల్లాళ్లు) దాటేలోగా అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం దగ్గర తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని లేకుంటే జరిమానా, జైలు శిక్ష తప్పవని ఫెడరల్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ కొత్త నిబంధనను పాటించకపోతే ఒక్కరినైనా సరే ప్రభుత్వం అరెస్టుచేసి జైలుకు తరలిస్తామని తెలిపింది. ఈ రూల్స్ ఫాలో కాకపోతే విజిటర్స్ ని అరెస్టు చేసి, జరిమానా, విధించి, వెనక్కు పంపే అధికారం తమ ప్రభుత్వానికి ఉంటుందని, మళ్లీ జీవితంలో తమ దేశంవైపు చూసే అవకాశం ఉండదని వైట్‌ హౌస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తరపున స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ వివాదాస్పద నిబంధనను ఒక ఫెడరల్‌ జడ్జి పరిశీలన అనంతరం ట్రంప్ అమలులోకి తెచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తీసుకొచ్చిన ఈ వివాదాస్పద నిబంధనను మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అమల్లోకి తేవడంపై అమెరికా వ్యాప్తంగా ఉంటున్న ఇమ్మిగ్రెంట్లు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యాయి.

ఈ కొత్త నిబంధన అమలును అడ్వకసీ గ్రూప్ వద్దని వారించడంతో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక జిల్లా జడ్జిని అపాయింట్‌ చేసి ఆతని పరిశీలనానంతరం ఆ రూల్‌ ను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అడ్వకసీ గ్రూప్స్ కు తగినంత చట్ట పరమైన పరిజ్ఞానం లేకపోవడంతో దీనిని లీగల్ గా సవాల్‌ చేస్తున్నారని జిల్లా జడ్జి కామెంట్‌ చేశారు.

కొత్త వారికి రిజిస్ట్రేషన్, పాత వారికి ఐడీ ప్రూఫ్

కొత్త రూల్ ప్రకారం అమెరికాలో ఉన్న విదేశీయులెవరైనా నెల్లాళ్లకు మించి అక్కడ ఉంటే వెంటనే తమ పేర్లను ఫెడల్‌ ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారు– వీసా హోల్డర్లు, చట్టబద్ధంగా ఉన్నశాశ్వత పౌరులు కూడా తమ ఐడీ ప్రూఫ్ లను ఎల్ల వేళలా తమ వెంట క్యారీ చేయాలి. అధికారులు అడిగిన ప్రతీసారి వాటిని చూపుతూ ఉండాలి. అలా చేయని వారికి ఐదు వేల అమెరికన్ డాలర్ల జరిమానా లేక నెల్లాళ్ల జైలు శిక్ష భరించాల్సి ఉంటుంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులు తక్షణం తమ ఉనికిని చట్టబద్ధం చేసుకోవాలి. లేనివారు వెంటనే వెనుదిరగాలి. ఇలా ప్రభుత్వ ఆదేశాలను మన్నించి పాటిస్తే వారికి మళ్లీ మళ్లీ అమెరికా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వం అన్ని నిబంధనలు, రూల్స్ ని తప్పనిసరిగా అమలు చేస్తుందని, ఎంపిక చేసిన నిబంధనలనే ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదని హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయమ్ తెలిపారు.

11 దాటాక వస్తే రూల్ కంపల్సరీ

కొత్త నిబంధన ప్రకారం ఎవరైనా విదేశీయులు ఏప్రిల్11 తర్వాత అమెరికాలో అడుగు పెడితే 30 రోజుల్లోగా డాక్యుమెంట్ల వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవాలి.14 ఏళ్లు దాటిన పిల్లలుంటే గతంలో రిజిస్ట్రేషన్ చేయించినా ఇప్పుడు మళ్లీ రీ రిజిస్టర్ చేసుకుని తమ బర్త్ డే లోగా ఫింగర్ ప్రింట్స్ కూడా సబ్ మిట్‌ చేయాలి.

గందరగోళ మయం అంటున్నవిదేశీయులు

అయితే ఈ కొత్త నిబంధన గందరగోళానికి గురి చేస్తుందని, సందర్శకులను తప్పుదోవ పట్టించేదిగా ఉందని విమర్శకులు అంటున్నారు.ఫెడరల్‌ ఏజెన్సీస్ కొత్త నిబంధన విధానాన్ని రూపొందించి, పాటించాలని వారంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం అలా చేయకుండా పాత చట్టాన్ని తిరిగి అమలు చేయడం తగదని అంటున్నారు. డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే జనవరి 20న దోపిడీ నుంచి అమెరికా ప్రజలను రక్షించే చట్టం అనే పేరుతో ఈ ఆదేశాలను విడుదల చేశారు. ఈ తాత్కాలిక రూల్‌ను మార్చి 12 నుంచి అమలు చేస్తున్నట్లు అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసులు సంఘటితంగా అమల్లోకి తెచ్చారు. 2022 నాటికి అమెరికాలో 2 లక్షల 20 వేలమంది సరైన డాక్యుమెంట్లు లేని భారతీయులు అమెరికాలో ఉన్నారని హోం ల్యాండ్ సెక్యూరిటీ అంచనా వేసింది.పెగ్స్ అనే మైగ్రేషన్ పాలసీ అధ్యయన సంస్థ ఈ సంఖ్యను 3,75000గా లెక్క కట్టగా, ప్యూ రిసెర్చ్ సెంటర్ ఆ సంఖ్యను ఏడు లక్షలుగా ప్రకటించింది.

అయితే హెచ్ వన్ బీ వీసా హోల్డర్లు, విదేశీ విద్యార్ధులు, గ్రీన్ కార్డు హోల్డర్లు ఉద్యోగం చేస్తున్న వారు తమ డాక్యుమెంట్లను ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. అయితే వారంతా తమ డాక్యుమెంట్లను ఎప్పుడూ తమతో క్యారీ చేసుకోవాలి. అధికారులు అడిగినప్పుడు చూపించాలి. తమ చిరునామాలు మారిన పక్షంలో పది రోజుల్లోగా ఆ కొత్త వివరాలు అధికార్లకు చెప్పాలి. లేదంటే జరిమానా తప్పదు. అలాగే మైనర్ల తల్లి దండ్రులు సైతం తమ వివరాలను, పిల్లల వివరాలను నెల్లాళ్లలోగా రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ కొత్త అధికారిక ఉత్తర్వు లక్షలాది మంది ఇమ్మిగ్రెంట్ల దైనందిన జీవితాలు మార్చేయనుంది. డాక్యుమెంటేషన్ అయినా కాకున్నా ఈ కొత్త రూల్‌ ప్రభావం మాత్రం అందరిపైనా పడుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com