25.1 C
Hyderabad
Tuesday, June 30, 2026

Live Video

spot_img

భాగ్యనగరంలో హనుమాన్ జయంతి ర్యాలీ

భాగ్యనగరంలో హనుమాన్ జయంతి ర్యాలీ సందడిగా సాగుతోంది. హైదరాబాద్ పాతబస్తీ గౌలిపుర డివిజన్ లోని ఆలే నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డిసిపి  స్నేహమేహర హాజరై ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీలో నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు. యువకులు కాషాయం జెండాలతో జైశ్రీరామ్. జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కన్నుల పండుగగా బైక్ ర్యాలీ ముందుకు సాగింది. ఈ బైక్ ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా సౌత్ జోన్ డిసిపి స్నేహ మేహర నేతృత్వంలో అడుగడుగున సీసీ కెమెరాలతో బైక్ ర్యాలీ కదలికలను పరిశీలిస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎండి జావిద్ .ఛత్రినాక ఏసిపి సి.హెచ్ .చంద్రశేఖర్. ఛత్రినాక సీఐ. నాగేంద్ర ప్రసాద్ వర్మ. మొగల్ పుర సీఐ. సి శ్రీను  తో పాటు డిఐలు మరియు ఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరోవైపు నగరంలోని గౌలిగూడతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తాడ్ బండ్ ఆంజనేయ స్వామి మందిరం వైపు ర్యాలీ సాగుతోంది. ఈ రోజు సాయంత్రం తాడ్ బండ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద భక్తుల వేల సంఖ్యలో పోటెత్తారు. కొండగట్టు అంజన్న దర్శనం కోసం సుమారు రెండు గంటలపాటు క్యూలో వేచి ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. విశ్వహిందుపరిషత్, బజరంగ్ దళ్ తోపాటు వివిధ స్వచ్ఛందసంస్థలు భక్తులకు మంచినీటితోపాటు అన్నదాన సౌకర్యం కల్పించాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ, పోలీసు శాఖ చర్యలు తీసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com