కొన్నాళ్లుగా మలయాళీ చిత్రాలు స్టార్ హీరో హీరోయిన్స్ లేకుండా చిన్న చిత్రాలుగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ప్రేక్షకులు కంటెంట్ బలంగా ఉంటే ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ఓ మలయాళీ మూవీ దూసుకుపోతోంది. ఇది ఓ థ్రిల్లర్ యాక్షన్ మూవీ. కానీ రొమాంటిక్ సీన్లతో నెట్టింట ఆ మూవీ పేరు మారుమోగుతోంది. అదే అంచక్కల్లకోక్కన్. ఉల్లాస్ చంబన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీనే ఊపేస్తుంది. ఈ సినిమా తెలుగులో చాప్రా మర్డర్ కేస్ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళీ వెర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో లుక్ మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్ ఆర్ ఆచారి, మేఘా థామస్ కీలకపాత్రలు పోషించారు. మర్డర్ కేసును పోలీసులు ఛేదించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
అడవిలో ఊహించని విధంగా ఓ వ్యక్తి హత్యకు గురవుతాడు. అతను ఎవరు ? అతన్ని ఎవరు చంపారు ?అనేది సినిమా. కేరళ, కర్ణాటక సరిహద్దు గ్రామంలో భూస్వామి చాప్రా (శ్రీజత్ రవి) హత్యకు గురవుతాడు. అప్పుడే అక్కడికి పోలీస్ స్టేషన్ వాసుదేవన్ (లుక్మన్ అవరన్) కానిస్టేబుల్ గా రావడం.. తన హెడ్ కానిస్టేబుల్ నందవరంబన్ పీటర్ (చెంబన్ వినోద్ జోస్) తో కలిసి చాప్రా హత్య కేసు ఎలా ఛేదించారనేది కథ. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కు కొదవే లేదు. ఇంట్లో పనిచేసేవాడితో భూస్వామి భార్య ఎఫైర్ గురించి సైతం బయటకు వస్తుంది. ఆద్యంతం ఈ సినిమా ఊహించని ట్విస్టులతో ఆకట్టుకుంటుంది.