30.2 C
Hyderabad
Wednesday, June 24, 2026

Live Video

spot_img

ఇండియన్సే హాట్ ఫేవరెట్

ఐపీఎల్ మెగా వేలం.. ఈ టైటిల్‌కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఒక్కో ప్లేయర్‌ కోసం కోట్లు గుమ్మరిస్తున్నాయి. అయితే ఈసారి హైలేట్ ఏంటంటే.. ఇలా కోట్లు కొల్లగొడుతున్న ప్లేయర్స్‌లో ఇండియన్ ప్లేయర్స్‌దే హవా. గతంలో విదేశీ ప్లేయర్ల కోసం కోట్లు ఖర్చు చేసేవి ఫ్రాంచైజీలు. కానీ ఈసారి ఆ సీన్ రివర్స్ అయ్యింది. టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 27 కోట్లను కుమ్మరించింది. పంత్ తర్వాత ఆ ప్లేస్‌ను దక్కించుకున్నాడు శ్రేయస్ అయ్యర్. పంజాబ్ కింగ్స్ ఈ కింగ్ కోసం రూ.26.75 కోట్లను ఖర్చు చేసింది.

ఇప్పటి వరకు రూ.24.75 కోట్లతో మిచెల్ స్టార్క్‌ టాప్ ప్లేస్‌లో ఉండేవాడు. కానీ ఇప్పుడా రికార్డును తిరగరాశారు పంత్ అండ్ అయ్యర్. ఈసారి జస్ట్ 11.75 కోట్లలో ఢిల్లీ అతడిని దక్కించుకుంది. ఇది కూడా చిన్న అమౌంట్ ఏమీ కాదు కానీ.. గతంతో పోలిస్తే మాత్రం సగానికి సగం పడిపోయింది అతని విలువ. వెంకటేష్‌ అయ్యర్ రూ.23.75 కోట్లు.. అర్షదీప్ సింగ్ రూ.18 కోట్లు, చాహల్ రూ.18 కోట్లు, షమీ రూ.10 కోట్లు, సిరాజ్ రూ.12.25 కోట్లు, రాహుల్ రూ.14 కోట్లు, అశ్విన్ రూ.9.75 కోట్లు.. ఇలా ఒక్కో ఇండియన్ ప్లేయర్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దక్కించుకున్నాయి.

మెగా వేలం జరిగిన తీరు చూస్తుంటే ఇండియన్ ప్లేయర్స్‌కు డిమాండ్ పెరిగినట్టు క్లియర్‌ కట్‌గా తెలుస్తోంది. అంతేకాదు ముందుగానే కొందరు ప్లేయర్స్‌ను సెలెక్ట్ చేసుకొని వారి కోసం ఎంత చెల్లించడానికైనా రెడీ అన్నట్టుగా ప్రాంచైజీలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ పంత్‌ కోసం జరిగిన బిడ్డింగ్. పంత్‌ను దక్కించుకునేందుకు లక్నో, హైదరాబాద్ పోటీ పడ్డాయి. కానీ చివర్లో అంటే రూ.20.75 కోట్ల వద్ద ఢిల్లీ RTM ఉపయోగించింది. దీంతో లక్నో ఒకేసారి బిడ్‌ను రూ.6.25 కోట్లు పెంచేసి రూ.27 కోట్లు బిడ్ దాఖలు చేసింది. దీంతో పంత్‌ లక్నోకు వెళ్లిపోయాడు. వేలం జరిగిన తీరు చూస్తే పంత్‌ కోసం దేనికైనా రెడీ అన్నట్టుగా కనిపించింది లక్నో యాజమాన్యం తీరు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com