తమిళనాడు పాలిటిక్స్‌లో మరో కీలక పరిణామం జరిగింది. వచ్చే ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నై వేదికగా ప్రకటించారు. రెండు పార్టీల నేతలు ఉమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టి.. ఈ ప్రకటనను వెలువరించాయి. ఎన్నిసీట్లలో పోటీ చేయాలి.. గెలిచిన తర్వాత మంత్రివర్గాలు ఎలా పంచుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. తాము అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి డైరెక్షన్‌లోనే ఎన్నికలకు వెళ్తామన్నారు అమిత్ షా.
ఈ పొత్తులో ఎలాంటి కండషన్స్, డిమాండ్స్ ఉండవన్నారు అమిత్ షా. అంతేకాదు అన్నాడీఎంకే పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ బీజేపీ జోక్యం ఉండదన్నారు. ఈ పొత్తుతో ఇరు పార్టీలకు మేలు జరుగుతుదన్నారు అమిత్ షా
తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం 4 సీట్లను మాత్రమే గెలుచుకుంది. కానీ 2023 సెప్టెంబర్‌లో NDA నుంచి అన్నాడీఎంకే బయటికి వచ్చంది. ఆ సమయంలో ఇరు పార్టీల మధ్య ఉన్న విబేధాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. మళ్లీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
ఇదే సమయంలో డీఎంకే సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అమిత్ షా. ప్రజల సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే సనాతన ధర్మం, లాంగ్వేజ్ వార్ అంటూ కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని.. కానీ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు అమిత్ షా. అంతేకాదు ప్రజలకు డీఎంకే సర్కార్ చేసిన లిక్కర్ స్కామ్ గురించి కూడా తెలుసన్నారు అమిత్ షా.