27.7 C
Hyderabad
Monday, June 29, 2026

Live Video

spot_img

సంతానోత్పత్తి పెంచేందుకు టోక్యో ప్రభుత్వం ప్రయోగం

  • జపాన్ లో దారుణంగా తగ్గిపోయిన జననరేటు
  • సగటున ఒక మహిళకు 1.2 శాతం
  • 2023లో కేవలం 7 లక్షల జననాలు
  • ఉద్యోగులపై పని వత్తిడి, ఆఫీసు పనుల భారం
  • కెరీర్ కు పేరెంటింగ్ కు మధ్య మహిళల సతమతం
  • అందుకే టోక్యో నగర పాలక సంస్థ సరికొత్త ప్రయోగం
  • గతంలో ఓ ఎన్జీవో సంస్థ ప్రయోగం సక్సెస్
  • ఇప్పుడు టోక్యో మెట్రోపాలిటన్ అథార్టీలో అమలు

జపాన్‌లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం కొన్ని వినూత్న చర్యలు తీసుకుంటోంది. అక్కడ ప్రస్తుతం జనన రేటు సగటున మహిళకు 1.2 శాతంగా నమోదైంది. అక్కడ జనాభా స్థిరత్వం కోసం  సగటున ఒక్కో మహిళ 2.1శాతంగా ఉండాల్సిందే. జనాభా పెంచేందుకు తీసుకుంటున్న రకరకాల చర్యల్లో భాగంగా వర్క్ బాలెన్స్ పాటిస్తూ కుటుంబ జీవనంపట్ల శ్రద్ధ పెంచేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రయోగాత్మకంగా టోక్యోలో ఉద్యోగులకు జాబ్‌ వేళలను కుదిస్తూ కొత్త నిర్ణయం అమలు చేస్తోంది. ఈ నెల నుంచి వారానికి నాలుగు రోజులే పనిదినాలుగా నిర్ణయించింది. టోక్యో గవర్నర్ యురికో కోయిక్ యువ జంటలను సంతానం కనే దిశగా ప్రోత్సహిస్తున్నారు. సంతానోత్పత్తి రేటును మరింతగా పెంచేందుకు ఇది దోహదపడుతుందని ఆమె నమ్ముతున్నారు. టోక్యో మెట్రోపాలిటన్ అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ కోయిక్ ఈ ప్రతిపాదన చేశారు. ఎవరైనా సంతానం కనడం, లేదా పిల్లలపై శ్రద్ధ పెట్టడాన్ని ఉద్యోగం కోసం ఫణంగా పెట్టడం సరికాదని అందరి వర్క్ స్టైల్స్ ని రివ్యూ చేసి తగిన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.

దారుణంగా పడిపోయిన జనన రేటు

2023లో జపాన్ లో కేవలం 7లక్షల 27 వేల జననాలు నమోదయ్యాయి.ఉద్యోగులపై సుదీర్ఘ పనివేళలు,మహిళలు కెరీర్‌కు  పేరెంటింగ్‌ బాధ్యతలకు మధ్య సతమతమయ్యేలా చేస్తున్నాయి. ఈ తాజా ప్రతిపాదన వల్ల లక్షా 60 వేలమంది మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ఉద్యోగులు వారానికి మూడు రోజులు పనిచేస్తే సరిపోతుంది. ఇక నర్సరీ, ప్రైమరీ స్కూళ్లకు వెళ్లే పిల్లలున్న తల్లి దండ్రులైతే తమ జీతం కుదించుకుని కనీసం రెండు గంటలు వర్కింగ్‌ అవర్స్ డ్యూటీనుంచి మినహాయింపు పొందే వీలు కల్పించారు.జపాన్ కు ఎదురవుతున్నసవాళ్లను తట్టుకుని నిలబడాలంటే ఉద్యోగులకు వర్క్ లైఫ్, పర్సనల్‌ లైఫ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని జపాన్ గవర్నర్ భావిస్తున్నారు.2022లో ప్రపంచ వ్యాప్తంగా ఒక ఎన్జీవో ప్రయోగాత్మకంగా ప్రతిపాదించిన 4రోజుల పనిదినాలు మంచి ఫలితాలను చూపించాయి. ఈ ప్రయోగంలో పాల్గొన్నవారిలో 90 శాతం మంది వర్క్ లైఫ్‌ బాలెన్స్ బాగుందని, కుటుంబంతో సరదాగా,సంతోషంగా ఎక్కువ సమయం గడపగలుగుతున్నామని తద్వారా తమ మానసిక ఆరోగ్యం బాగుందని వెల్లడించారు.

ఈ ప్రయోగాన్నిదృష్టిలో పెట్టుకుని ప్రభుత్వోద్యోగులకు పని ఒత్తిడి తగ్గించాలని, అప్పుడే ప్రత్యేకించి మహిళలు పిల్లల సంరక్షణ, ఆఫీసు పనులను సమన్వయం చేసుకుని ఆనందంగా గడపగలుగుతారని టోక్యో ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు. ఇదే ప్రయోగం సక్సెస్ అయితే జపాన్ వ్యాప్తంగా దీనిని అమలు చేసే అవకాశముంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com