రష్యా నుంచి బయలుదేరిన ఓ విమానం తుర్కియేలో ల్యాండవుతుండగా మంటలు చెలరేగాయి. తుర్కియేలోని అంటాల్యా ఎయిర్పోర్టులో సుఖోయ్ సూపర్ జెట్-100 విమానంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మొదట ఇంజన్లో చెలరేగిన మంటలు క్రమంగా విమానమంతటా వ్యాపించాయి. అధికారులు అప్రమత్తమై అత్యంత వేగంగా స్పందించారు. ఫలితంగా 89 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బందిని కాపాడారు. అయితే విమానం మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.