22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు

  • ఆర్‌బీఐ కీలక నిర్ణయం

  • డిజిటల్‌ ఇండియా దిశగా మరో మలుపు

డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ ద్వారా చెల్లింపుల పరిమితిని పెంచేసింది. ఈమేరకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ – ఎన్‌సీపీఐకి అనుమతి మంజూరు చేసింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా నిర్ణయంతో వ్యక్తుల నుంచి వ్యాపారులకు చెల్లించే లావాదేవీల పరిమితి పెరగనుంది. ఈ యూపీఐ చెల్లింపుల పరిమితిని తమ అవసరాలకు అనుగుణంగా పెంచుకునేందుకు అవకాశం లభించనుంది.

UPI ద్వారా వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) లావాదేవీల పరిమితులను త్వరలో సవరించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే వ్యక్తి-నుంచి-వ్యక్తి (P2P) లావాదేవీల పరిమితి మాత్రం ఇప్పుడున్న మాదిరిగానే లక్ష రూపాయలుగానే ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P), వ్యక్తి నుంచి మర్చంట్‌కి (P2M) రెండింటికీ యూపీఐ పరిమితి రూ.1లక్ష ఉంది. అయితే, ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో వ్యక్తుల నుంచి వ్యాపారులకు చేసే చెల్లింపుల పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో చర్చించిన తర్వాత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా P2M లావాదేవీల పరిమితిని పెంచుకోవచ్చని ఎన్‌సీపీఐకి అనుమతి ఇచ్చారు. యూపీఐ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు, వినియోగాన్ని పెంచడానికి ఈ ప్రతిపాదన చేస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు, యూపీఐ ఎకో సిస్టమ్‌లోని వాటాదారులను సంప్రదించి ఈ పరిమితిని సర్దుబాటు చేసే స్వేచ్ఛ ఎన్‌సీపీఐకి ఉంటుంది. ఈ నిర్ణయంతో డిజిటల్‌ పేమెంట్స్‌ మరింతగా పెరగనున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వ్యాపార లావాదేవీలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com