22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

అందుబాటులోకి ఆధార్ కొత్త యాప్

మన దేశంలో ఇప్పుడు ఆధార్‌ కార్డు ప్రధాన గుర్తింపు కార్డుగా మారిపోయింది. ఏ విధమైన గుర్తింపుకైనా ఆధార్‌ మొదటి ప్రాధాన్యతగా మారిపోయింది. అయితే, ఇలా మనం గుర్తింపు కార్డు చూపించడం కోసం ఇకపై ఆధార్‌ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఓ యాప్‌ ద్వారానే మన ఆధార్‌ గుర్తింపు పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ – యూఐడీఏఐ త్వరలోనే కొత్త ఆధార్ యాప్‌ అందుబాటులోకి తీసుకు రాబోతోంది.

ఈ యాప్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్‌ వంటి ఫీచర్ల ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎంఆధార్ యాప్‌తో పోలిస్తే ఈ కొత్త యాప్‌ రీ డిజైన్ చేసిన ఇంటర్‌ఫేస్‌ కలిగి ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉందని, త్వరలోనే దేశవ్యాప్తంగా డిజిటల్ ఆధార్ కార్డ్ అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొత్త యాప్‌లో, మొత్తం ప్రక్రియ ఫేస్‌ రికగ్నిషన్‌ సహాయంతో జరుగుతుందన్నారు. ఈమేరకు మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన స్వయంగా కొత్త ఆధార్ యాప్ గురించి వివరించి ఒక చిన్న వీడియోను పోస్ట్ చేశారు. ఆయన కొత్త ఆధార్ యాప్, మొబైల్ యాప్ ద్వారా ఫేస్ ఐడి ధృవీకరణ గురించి చెప్పారు.

ఈ కొత్త యాప్‌ ద్వారా వెరిఫికేషన్ సమయంలో స్కాన్ చేయడం సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. ప్రస్తుతం యూపీఐ లాంటి చెల్లింపుల క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తున్న తరహాలోనే ఇది కూడా పని చేస్తుందని కేంద్ర మంత్రి వైష్ణవ్‌ పేర్కొన్నారు. దీనివల్ల అత్యంత సురక్షితంగా, సులభంగా ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని మంత్రి వెల్లడించారు. కొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ప్రజలు తమ మొబైల్ ఫోన్ నుంచి ఆధార్‌ కార్డును షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఇది అన్ని చోట్ల, అన్ని పనులకు ఉపయోగించవచ్చని, ఎక్కడికి వెళ్లినా చేతిలో ఆధార్ కార్డును పట్టుకెళ్లాల్సిన పని ఉండదని మంత్రి స్పష్టం చేశారు.ఇది అందుబాటులోకి వస్తే.. ఆధార్‌ గుర్తింపు కోసం ఇకపై ఎక్కడా ఫిజికల్‌ కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే, హోటళ్ళు, విమానాశ్రయాలలో కూడా ఫోటో కాపీలను అందించాల్సిన అవసరం ఉండదు. అలాగే, కొత్త ఆధార్ యాప్‌తో మోసానికి అవకాశం ఉండదని కూడా యూఐడీఏఐ చెబుతోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com