27.2 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

సైబర్ మోసాల నుండి సింపుల్‌ టిప్స్‌తో సేఫ్టీ

ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ వేదికగా ఫేక్ మెసేజ్‌లు, ఫిషింగ్ లింకులు, అనుమానాస్పద కాల్స్‌ ద్వారా ప్రజలను మోసం చేసే ఘటనలు ఎక్కువవుతున్నాయి. అయితే, చిన్నపాటి జాగ్రత్తలతో మీ డేటాను, అకౌంట్‌ను రక్షించుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా… వాట్సాప్ సెట్టింగ్స్‌లో కొన్ని సింపుల్ మార్పులు. అవేంటో చూద్దాం…

ప్రొఫైల్ ఫొటోతో మోసాలు చేయకుండా చెక్‌ పెట్టండి :

మీ ఫోటోను స్కామర్లు చెక్ చేసి, అదే ఆధారంగా మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడం దగ్గర నుంచి, దాన్ని వాడుకుని మిమ్మల్ని మోసం చేయడమే లక్ష్యం. అందుకే, మీ ప్రొఫైల్ పిక్‌ను కేవలం కాంటాక్ట్స్‌లో ఉన్నవారికే కనిపించేలా సెట్ చేయండి. దీనికోసం మీ మొబైల్‌లో Settingsలోకి వెళ్లి Privacy ఆప్షన్‌ క్లిక్‌ చేయండి. తర్వాత Profile Photo ఆప్షన్‌లో Only My Contacts

లాస్ట్‌ సీన్‌, అబౌట్‌ వివరాలు ఇలా సీక్రెట్‌ :

వాట్సప్‌లో మీ లాస్ట్ సీన్, అబౌట్ డిటెయిల్స్ చూసి కూడా స్కామర్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో ఉన్న సమయంలో గమనించి.. సైబర్‌ మోసాలు చేయొచ్చు. కాబట్టి ఈ సమాచారం అపరిచితులకు తెలియకుండా జాగ్రత్త పడొచ్చు. దీనికోసం.. మీ మొబైల్‌లో Settings లోకి వెళ్లి.. Privacy ఆప్షన్‌ క్లిక్‌ చేయండి. Last Seen & Online అనే ఆప్షన్‌లోకి వెళ్లి.. Nobody గానీ, My Contacts Only గానీ సెలెక్ట్‌ చేసుకోండి. అలాగే, Privacyలో About ఆప్షన్‌ కూడా ఇలాగే సెట్‌ చేసుకోండి. Nobody ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసుకుంటే మీరు ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్నారో ఎవరికీ తెలియదు. My Contacts Only సెలెక్ట్‌ చేసుకుంటే మీ మొబైల్‌ కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో ఉన్నవాళ్లకు మాత్రమే మీ సమాచారం తెలుస్తుంది.

టు-స్టెప్‌ వెరిఫికేషన్‌తో మీరు సేఫ్‌ :

వాట్సప్‌కు సంబంధించి.. మీకు రావాల్సిన ఓటీపీ స్కామర్లకు తెలిసినా సరే.. వారిని కట్టడి చేయాలంటే మరో సెట్టింగ్‌ ఉంది. టు-స్టెప్‌ వెరిఫికేషన్‌ ఎనేబుల్‌ చేసుకుంటే.. వాట్సప్‌ ఓపెన్‌ చేసినప్పుడు ఆరు అంకెల పిన్‌ అడుగుతుంది. దీనిని యాక్టివేట్‌ చేయడం కోసం.. Settings లోకి వెళ్లి.. Account ఆప్షన్‌పై క్లిక్‌ చేసి.. Two-Step Verification యాక్టివేట్‌ చేసుకోవాలి. అయితే, ఈ సమయంలో మీ మెయిల్‌ ఐడీని కూడా యాడ్‌ చేస్తే.. ఫ్యూచర్‌లో మీరు పిన్‌ మర్చిపోయినా రికవరీ చేసుకోవచ్చు.

ఎవరు పడితే వాళ్లు గ్రూపుల్లో యాడ్‌ చేయకుండా… :

కొంతమంది ఏదేదో గ్రూపుల్లో మీ నెంబర్‌ యాడ్‌ చేస్తూ ఉంటారు. ఆ గ్రూపుల్లో స్కామర్లు ఉంటారు. మీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ చేయడమే వాళ్ల టార్గెట్‌ అవుతుంది. అయితే, ఇలా.. గుర్తు తెలియని వ్యక్తులు, మీ కాంటాక్ట్స్‌లో లేని వాళ్లు.. మిమ్మల్ని ఏదైనా వాట్సప్‌ గ్రూపుల్లో యాడ్‌ చేయకుండా ఈ సెట్టింగ్‌ ఆన్‌ చేసుకోండి. దీనికోసం.. Settings లోకి వెళ్లి.. Privacy ఆప్షన్‌ క్లిక్‌ చేసి.. Groups ఆప్షన్‌లో My Contacts Only అనేది సెలెక్ట్‌ చేసుకోండి.

ఇప్పుడు చెప్పుకున్న సెట్టింగ్స్‌ అన్నీ సింపుల్‌గా చేసుకోవచ్చు. ఓ ఐదు నిమిషాలు వీటికోసం కేటాయిస్తే.. మీ డేటా, పర్సనల్‌ ఇన్ఫర్‌మేషన్‌, బ్యాంకు అకౌంట్లలో డబ్బులు భద్రంగా ఉంచుకోవచ్చు. సైబర్‌ క్రిమినల్స్‌ బారి నుంచి కాపాడుకోవచ్చు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com