23.5 C
Hyderabad
Thursday, July 30, 2026

Live Video

spot_img

సారపాకలో సిఎం రేవంత్ రెడ్డి సహాపంక్తి బోజనం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

రాముల వారి కళ్యాణం తర్వాత బూర్గంపాడు మండలం సారపాక బయలు దేరారు.  పర్యటనలో భాగంగా సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి.. అక్కడే భోజనం చేశారు. అనంతరం శ్రీనివాస్ కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు భోజనం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రితో కలిసి బోజనం చేశారు.

ప్రతిపక్షాలు సన్నబియ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఏదో ఒక సమయంలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి బోజనం చేయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వెళ్లి మొదటగా బోజనం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com