32.2 C
Hyderabad
Sunday, April 26, 2026

Live Video

spot_img

బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు – నేతలకు కేసీఆర్‌ దిశా నిర్దేశం

సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫాంహోస్‌లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పార్టీ అధినేత కేసీఆర్‌.. వివిధ జిల్లాల వారీగా ముఖ్య నేతలను పిలిపించుకొని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పార్టీ ప్రస్థానం, 25 యేళ్ల వేడుకలు నిర్వహించాల్సిన తీరు, ప్రసంగాలు వంటి అంశాలపై నేతలకు మార్గదర్శనం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన సమావేశానికి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు సంబంధించి నేతలకు కేసీఆర్ మార్గదర్శనం చేశారు. నియోజకవర్గాల స్థాయిలో కార్యకర్తల సమావేశాలను నిర్వహించి, వరంగల్ సభకు అధిక మొత్తంలో జనాన్ని తరలించేందకు కృషి చేయాలని కేసీఆర్‌ సూచించారు. ఇప్పటికే, ఉమ్మడి వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ వరకు ఇలా జిల్లాల వారీ నేతలు, ముఖ్య నాయకులతో కేసీఆర్‌ వరుస సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక, ఇవాళ జరిగిన సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, సిహెచ్ లక్ష్మారెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్,చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్ర శేఖర్ రెడ్డి, పార్టీ నేతలు డా.ఆంజనేయ గౌడ్, హనుమంతు నాయుడు, గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి చూస్తే.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే లు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, బానోత్ మదన్ లాల్, బానోత్ హరిప్రియ నాయక్, రేగ కాంతారావు, మెచ్చా నాగేశ్వర్ రావు, వనం వెంకటేశ్వర రావు, లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి.. మాజీ మంత్రి ఎమ్మెల్యే జి.జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మేల్యేలు రామావత్ రవీంద్ర కుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ సీనియర్ నేత విజయ సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆయా జిల్లాల నేతలకు కేసీఆర్‌ మార్గనిర్దేశం చేసిన సమావేశంలో.. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు కూడా పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com