పాత చట్టానికి బిజేపి ప్రతిపాదిత సవరణలకు తేడా…
– వక్ఫ్ చట్టం1995 అనే పేరును సవరణలో ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత, అభివృద్ధిగా మార్చాలని ప్రతిపాదన
– వక్ఫ్ బోర్డులో దాతలను సభ్యులుగా నియమించవచ్చు అయితే వారు ఐదున్నరేళ్లు ముస్లిం మతం ఆచరించి ఉండాలి. అలాగే స్త్రీల వారసత్వాన్ని తిరస్కరించకూడదు.
-పాత చట్టంలో ప్రభుత్వ ఆస్తులపై స్పష్టమైన నిబంధనలేదు. కొత్త చట్టంలో వక్ఫ్ గా గుర్తించిన ప్రభుత్వ ఆస్తులు ఇక ఉండవు. వివాదంలో ఉన్న ఆస్తులపై మాత్రం రాష్ట్రాల్లోని సంబంధిత కలెక్టర్లే సమస్యలు పరిష్కరిస్తారు.
– ఏది వక్ఫ్ భూమి నిర్ణయించే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండగా, ఈ నిబంధన కొత్త చట్టంలో తొలగిపోతుంది.
-వక్ఫ్ఆస్తుల సర్వేను కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు నిర్వహించాలని పాత చట్టంలో ఉండగా, కొత్త బిల్లులోరాష్ట్ర రెవిన్యూ చట్టాల ప్రకారం సర్వేనిర్వహణ హక్కు కలెక్టర్లకు కేటాయించారు.
-పాత చట్టంలోకేంద్ర వక్ఫ్ కౌన్సిల్ లో ఇద్దరు మహిళలతో సహా సభ్యులందరూ ముస్లింలే ఉండాలి. కొత్త ప్రతిపాదనలో ఇద్దరు ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు.బోర్డులో ఉన్న న్యాయమూర్తులు,ప్రముఖులు ముస్లింలు కానవసరం లేదు.వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఉండాలి.
– పాత చట్టంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు ప్రజాప్రతినిధులు, కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. కొత్త సవరణ బిల్లులో ఇద్దరు ముస్లిమేతరులు, షియా, సున్నీ వెనుకబడిన వర్గాలకు చెందిన ముస్లింలు,బోహ్రా, ఆగాఖానీల నుంచి ఒక్కొక్క బోర్డు సభ్యుడిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఇద్దరు ముస్లిం మహిళలు కూడా ఉండాలి.
– వక్ఫ్ ట్రిబ్యునల్ విషయానికొస్తే ఒక న్యాయమూర్తి తో పాటు, అదనపు జిల్లా మేజిస్ట్రేట్, ముస్లిం లీగల్ ఎక్స్ పర్ట్ ఉండాలని పాత చట్టం చెబుతుంటే కొత్త ప్రతిపాదనలో ముస్లిం న్యాయనిపుణుడి నిబంధన తొలగించారు.న్యాయమూర్తి ఛైర్మన్గా, సంయుక్త కార్యదర్శులుగా ప్రభుత్వం ట్రిబ్యునల్ లో ఉండాలి.
-వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులపై ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే హై కోర్టు జోక్యం చేసుకునే వీలు పాత చట్టంలో ఉండగా, కొత్త సవరణలో ట్రిబ్యునల్ తీర్పుపై 90 రోజుల్లో హై కోర్టుకు వెళ్ల వచ్చు.
– పాత చట్టంలో వక్ఫ్ ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిట్ ఎప్పుడైనా చేయవచ్చని ఉండగా కొత్త సవరణలో వక్ఫ్ రిజిస్ట్రేషన్, ఖాతాలు, ఆడిట్లపై కాగ్ లేదా సంబంధిత అధికారి మాత్రమే చేయాలి. ఆ నిబంధనలు డిసైడ్ చేసే అధికారం మాత్రం కేంద్రానికే ఉంటుంది.
-పాతచట్టంలో షియా, సున్నీలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులుండగా, కొత్త సవరణలో బోహ్రా, ఆగాఖానిలకు కూడా వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు.